Begin typing your search above and press return to search.

గ్రౌండ్ రిపోర్ట్ : 'గుడివాడ'లో గెలుపెవరిది?

By:  Tupaki Desk   |   21 March 2019 11:40 AM GMT
గ్రౌండ్ రిపోర్ట్ : గుడివాడలో గెలుపెవరిది?
X
అసెంబ్లీ నియోజకవర్గం : గుడివాడ
టీడీపీ: దేవినేని అవినాష్
వైసీపీ : కొడాలి నాని

కృష్ణజిల్లా గుడివాడ నియోజకవర్గంలో అసెంబ్లీ పోరు రసవత్తరంగా సాగుతోంది. ఇక్కడ పోటీ పార్టీలతో పని లేకుండా అభ్యర్థుల మధ్యే పోటీ తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే వైసీపీ నుంచి పోటీ చేస్తున్న కొడాలి నాని నియోజకవర్గంలోనే కాకుండా జిల్లావ్యాప్తంగా పట్టున్న నేతగా పేరు తెచ్చుకున్నారు. అంతేస్థాయిలో టీడీపీ కూడా దేవినేని నెహ్రూ కుమారుడు దేవినేని అవినాష్‌ ను ఆయనపై పోటీలోకి తెచ్చింది. రాజకీయంగా భారీ బ్యాక్‌ రౌండ్‌ ఉన్న అవినాష్‌, సొంతగా ప్రజాబలంతో పాటు పార్టీ అండదండలున్న కొడాలి నానిల్లో ఎవరు విజయం సాధిస్తారోనని ఆసక్తి నెలకొంది.

వైసీపీలో ముఖ్య నాయకులను ఓడించాలని టీడీపీ టార్గెట్‌ పెట్టుకున్న వారిలో కొడాలి నాని ఒకరు. ఆయన రెండు సార్లు టీడీపీ 2004,2009లో టీడీపీ తరుపున పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాత వైసీపీలో చేరిన 2014లో వైసీపీ తరుపున పోటీ చేసి గెలుపొందారు. దీంతో ఆయన ఏ పార్టీలో ఉన్నా విజయం సాధిస్తారని నియోజకవర్గ ప్రజలు అనుకుంటారు.

* గుడివాడ చరిత్ర..
1958లో గుడివాడ నియోజకవర్గం ఏర్పడింది. లక్షా 70వేలకు పైగా ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో గుడివాడ రూరల్‌, నందివాడ, గొడ్లవల్లేరు మండలాలున్నాయి.మొదట్లో ఈ నియోజకవర్గం కాంగ్రెస్‌ కు కంచుకోటగా ఉండేది. టీడీపీ ఆవిర్భవించిన తరువాత మరే పార్టీ ఇక్కడ విజయం సాధించకపోవడం విశేషం. 1983లో టీడీపీ ఆవిర్భవించిన తరువాత ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్‌.టి.రామారావు మొదటిసారిగా ఇక్కడి నుంచే పోటీ చేసి విజయం సాధించారు. ఆ తరువాత గుడివాడ టీడీపీకి పట్టున్న నియోజకవర్గంగా మారి టీడీపీ నేతలే గెలుస్తూ వస్తున్నారు.

*దూకుడే కొడాలి నాని బలం..
ప్రస్తుత ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వర్‌ రావు(నాని) కూడా టీడీపీ తరుపున రెండు సార్లు గెలిచారు. అయితే 2014లో మాత్రం నాని వైసీపీలో చేరి అక్కడి నుంచి గెలిచారు. గుడివాడ నియోజకవర్గంపై వైసీపీ జెండా ఎగిరింది. ఆ తర్వాత బాబుకు కొరకరాని కొయ్యగా నాని మారాడు. పదునైన విమర్శలు, ప్రజలకు చేరువ అవుతూ తిరుగులేని నాయకుడిగా మారాడు. నానిని ఎలాగైనా ఓడించాలనే అవినాష్ ను బాబు రంగంలోకి దింపాడు. నానికి జనంలో మాస్ ఈమేజ్ ఉంది. తన అనుచరుల కోసం.. నమ్మినవారి కోసం ప్రజల కోసం ఎంతకైనా తెగిస్తారనే పేరు ఉంది. ఆ మాస్ ఇమేజే ఆయనను నియోజకవర్గంలో మంచి బలమైన నాయకుడిగా మారారు. నాని దూకుడు ను అవినాష్ కంట్రోల్ చేస్తాడా లేదా అన్న విషయంపైనే గెలుపు ఆధారపడి ఉంది.

*టీడీపీ నుంచి దేవినేని అవినాష్ పోటీతో రసవత్తరం
ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ ఎలాగైనా ఈసారి గుడివాడలో పాగా వేయాలనే ఉద్దేశంతో మాజీ మంత్రి దేవినేని నెహ్రు కుమారుడు దేవినేని అవినాశ్‌ ను రంగంలోకి దించింది. కొడాలి నాని టీడీపీని వీడినప్పటి నుంచి చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.దీంతో గుడివాడ నియోజకవర్గంలో ఎలాగైనా టీడీపీ పాగా వేయాలే ఉద్దేశ్యంతో చంద్రబాబు రకరకాల ఎత్తులు వేశారు. అయితే మాజీ మంత్రి దేవినేని నెహ్రూ కుమారుడు అవినాశ్‌ ను రంరగంలోకి దించడంతో పోర రసవత్తరంగా మారే అవకాశం ఉంది. అంతేకాకుండా టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ సొంత నియోజకవర్గం కావడంతో కావడంతో ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా పాగా వేయాలే ఉద్దేశ్యంతో చంద్రబాబు మాజీ మంత్రి కుమారుడిని ఎన్నికల బరిలో దించినటట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ప్రతిపక్ష నియోజకవర్గమైనా అభివృద్ధి విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా చంద్రబాబు ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించడం విశేషంగా మారింది. అయితే ఈసారి ఎన్నికల్లో టీడీపీ పాగా వేయనుందా లేదా అనేది ఆసక్తిగా మారింది.

* అవినాష్ కు ప్రతికూలం:
2019 ఎన్నికల ప్రచారంలో అవినాష్ దూకుడుగా ముందుకెళ్తున్నారు.. నియోజకవర్గంలోని కాపులను ఆకట్టుకోవడానికి వంగవీటి రాధా కూడా అవినాష్ కు ఉపయోగపడుతున్నారు. అయితే నాన్ లోకల్ ఫ్యాక్టర్ అవినాష్ కు ఇబ్బంది కలిగించేది. దీనికోసం ఆయన గుడివాడలో ఇల్లు తీసుకుని గృహప్రవేశం చేశారు.

* నానికి ప్రతికూలం:
ఇక వరుసగా మూడు సార్లు గెలిచినా మూడు సార్లూ ప్రతిపక్షంలో ఉండడంతో గుడివాడలో పెద్దగా అభివృద్ధి జరగలేదు. ఇది నానికి కొంత ప్రతికూల అంశం. అయితే ఈ సారి గెలిస్తే తనకు జగన్ క్యాబినెట్ లో మంత్రిపదవి గారంటీ అని మరొక్కసారి అవకాశం ఇవ్వాలని నాని ప్రజలని అడుగుతున్నారు. దీనితో ఏం జరగబోతుంది అనేది చూడాలి.

*అంతిమంగా ఎవరిదో గెలుపో చెప్పడం కష్టం
కొడాలి నాని బలంగా ఉన్నారు. దేవినేని అవినాష్ అధికార పార్టీ బలంతో అంతే దూకుడుగా ముందుకెళ్తున్నారు. ఈ ఇద్దరూ నువ్వానేనా అన్నట్టు గుడివాడ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. అంతిమంగా ఎవరు గెలుస్తారో ఈ నియోజకవర్గంలో చెప్పడం కష్టంగా ఉంది.