Begin typing your search above and press return to search.

ఎన్నారైకి బెదిరింపు...నీ దేశం వెళ్లిపో

By:  Tupaki Desk   |   26 March 2017 4:09 AM GMT
ఎన్నారైకి బెదిరింపు...నీ దేశం వెళ్లిపో
X
అగ్ర‌రాజ్యం అమెరికాలో విద్వేష దాడులు ఆగడం లేదు. ముఖ్యంగా దక్షిణాసియా దేశాలకు చెందిన వ్యక్తులపై వ్యతిరేకత నానాటికీ పెరిగిపోతోంది. అమెరికాలోని ఇండియానా రాష్ట్రం నేమ్‌సేక్ పట్టణానికి చెందిన రాజ్‌ ప్రీత్ హిర్ అనే సిక్కు యువతి ఇలాంటి అనుభ‌వ‌మే ఎదుర‌యింది. రాజ్ ప్రీత్ హిర్ కొన్ని రోజుల కిందట మాన్‌ హట్టన్‌ లో స్నేహితుడి జన్మదిన వేడుకలకు హాజరయ్యేందుకు న్యూయార్క్ రైల్వే సబ్‌ వేకు చేరుకున్నారు. ఇంతలో అక్కడికి వచ్చిన ఓ శ్వేతజాతీయుడు రాజ్‌ ప్రీత్‌ ను మధ్య ఆసియా దేశానికి చెందిన యువతిగా భావించి దూషించాడు. ``నువ్వు ఈ దేశానికి చెందిన వ్యక్తివి కాదు. లెబనాన్‌ కు వెళ్లిపో`` అని అరిచాడు.

తనకు ఎదురైన ఈ వేధింపుల గురించి రాజ్‌ ప్రీత్ ఇటీవల ఓ వీడియోలో వివరించారు. ``ఈ వారం విద్వేషపూరితమైంది. అధ్యక్ష పదవి కోసం డొనాల్డ్ ట్రంప్ బరిలో నిలిచినప్పటి నుంచి అమెరికాలో విద్వేషపూరిత నేరాలు, వేధింపులు తీవ్రమయ్యాయని ఈ సంఘటన రుజువు చేస్తున్నది`` అని ఆమె పేర్కొన్నారు. తాను సెల్‌ఫోన్‌ను చూసుకుంటుండగా అక్కడికి వచ్చిన శ్వేత జాతీయుడు అరవడం మొదలు పెట్టాడని ఆమె చెప్పారు. ``అమెరికా సైనికుల పోరాటం నీకు తెలుసా? ఈ దేశం కోసం వాళ్లు ఏం త్యాగం చేస్తున్నారో నీకు తెలుసా? ఇదంతా కేవలం నీలాంటి ప్రజల వల్లనే జరుగుతోంది`` అని నిందించాడని, తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడని రాజ్‌ప్రీత్ తెలిపారు. తాను లెబనాన్‌కు 30 మైళ్ల దూరంలో ఉన్న ఇండియానా రాష్ట్రంలోని నేమ్‌సేక్‌లో పుట్టాను. కానీ, మధ్యఆసియాకు చెందిన లెబనాన్‌లో కాదు అని రాజ్‌ ప్రీత్ ఈ సంద‌ర్భంగా స్ప‌ష్ట‌త ఇచ్చారు.

ఇదిలాఉండ‌గా.... భార‌త‌దేశంతో బలమైన సంబంధాలను కొనసాగించడమే ట్రంప్ ప్రభుత్వ లక్ష్యమని అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ మాటిస్ స్పష్టం చేశారు. రెండు దేశాలూ భద్రతాపరంగా ఉమ్మడి సవాళ్లను ఎదుర్కొంటున్నాయని, కలిసి పనిచేస్తే ఎన్నో ప్రయోజనాలనూ పొందే అవకాశం ఉందని అన్నారు. భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ తో ఆయన పెంటగాన్‌ లో సమావేశమై కీలక ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు.ప్రాంతీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఇరు దేశాలు కలసికట్టుగా ముందుకెళ్లే రీతిలో సరికొత్త మార్గాల్లో ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతో ఉందని దోవల్ ఈ సందర్భంగా ఉద్ఘాటించారు. ఎప్పటికప్పుడు మైత్రీబంధం కొత్త పుంతలు తొక్కినప్పుడే అన్ని విధాలుగా బలపడే అవకాశం ఉంటుందని అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/