Begin typing your search above and press return to search.

ట్రంప్... టిట్ ఫ‌ర్ ట్యాట్ అంటే ఇదే!

By:  Tupaki Desk   |   25 Feb 2017 9:30 AM GMT
ట్రంప్... టిట్ ఫ‌ర్ ట్యాట్ అంటే ఇదే!
X
అమెరికా అధ్య‌క్షుడైనంత మాత్రాన తాను చెప్పిన దానినే మీడియా రిపోర్ట్ చేయాల‌ని ప్ర‌క‌ట‌న‌లు జారీ చేసిన డొనాల్డ్ ట్రంప్‌ కు నిజంగానే ఎదురు దెబ్బ త‌గిలింది. ట్రంప్ అమెరికా అధ్య‌క్షుడిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన మ‌రుక్ష‌ణ‌మే... ఆయ‌న దుందుడుకు వైఖ‌రిని గుర్తుకు తెచ్చుకున్న అమెరికా జ‌నం రోడ్డెక్కి నిర‌స‌న‌ల‌కు తెర తీశారు. రోజుల త‌ర‌బ‌డి కొన‌సాగిన ఈ నిర‌స‌న‌ల‌పై ట్రంప్ ఉక్కుపాదం మోపిన సంగ‌తి తెలిసిందే. ప‌నిలో ప‌నిగా నిర‌స‌న‌కారులకు గ‌ట్టిగా హెచ్చ‌రిక‌లు జారీ చేసిన ట్రంప్... స‌ద‌రు నిర‌స‌న‌ల‌న‌ను రిపోర్ట్ చేసిన మీడియా సంస్థ‌ల‌పై క‌న్నెర్ర‌జేశారు. ఈ క్ర‌మంలో త‌న‌కు అనుకూలంగా ప‌నిచేస్తున్న మీడియా సంస్థ‌లు, వ్య‌తిరేకంగా వార్త‌లు రాస్తున్న సంస్థ‌లు అంటూ... ట్రంప్ వ‌ర్గం మీడియాను రెండు విభాగాలు విభ‌జించింది. దీనిపై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు రేకెత్తినా... మీడియా సంస్థ‌లు సంయ‌మ‌నం పాటించాయి.

అయితే స‌ద‌రు సంస్థ‌ల‌కు ఇప్పుడు స‌రైన అవ‌కాశం దొరికింది. అంతే ముందూ వెనుకా చూడ‌కుండా... అమెరికాకు అధ్యక్షుడైతే త‌మ‌కేంటి అంటూ నిర‌స‌న గ‌ళం విప్ప‌డ‌మే కాదు... ఏకంగా ట్రంప్‌ కు పెద్ద షాకే ఇచ్చాయి. ఈ ఘట‌న వివ‌రాల్లోకెళితే... వైట్ హౌస్‌ లో జ‌రిగే మీడియా బ్రీఫింగ్ కు సీఎన్ఎన్‌ - న్యూయార్క్ టైమ్స్‌ - లాస్ ఏంజెలిస్ టైమ్స్ త‌దిత‌ర మీడియా సంస్థ‌ల ప్ర‌తినిధుల‌కు ఆహ్వానాలు వెళ్ల‌లేదు. ట్రంప్ ఉద్దేశ‌పూర్వ‌కంగానే ఆ మీడియా సంస్థ‌ల‌కు ఆహ్వానాలు వెళ్ల‌కుండా త‌న అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. ఇక మీడియా బ్రీఫింగ్ ఆహ్వానం అందుకున్న మీడియా ప్ర‌తినిధులు కూడా కెమెరాల‌లు లేకుండానే లోప‌లికి రావాలంటూ ట్రంప్ యంత్రాంగం వింత పోక‌డ‌లు పోయింది.

అంతేకాకుండా... ప్ర‌ధాన ద్వారం వ‌ద్దే మీడియా ప్ర‌తినిధుల‌ను ఆపేసిన ట్రంప్ అధికార యంత్రాంగం... మీడియా ప్ర‌తినిధుల‌ను చెక్ చేయ‌డం ప్రారంభించింద‌ట‌. ఈ దుందుడుకు చ‌ర్య‌ల‌కు విసుగెత్తిపోయిన మీడియా ప్ర‌తినిధులు ట్రంప్ బృందానికి షాకిస్తూ మీడియా బ్రీఫింగ్‌ ను బ‌హిష్క‌రిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించేసి అక్క‌డి నుంచి విస‌విసా వెళ్లిపోయార‌ట‌. ఈ ఊహించ‌ని ప‌రిణామంతో ట్రంప్ అండ్ కో షాక్ తిన్న‌ద‌ట‌.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/