Begin typing your search above and press return to search.

వాట్సప్‌ వినియోగదార్లకు కంగారు అక్కర్లేదు!

By:  Tupaki Desk   |   29 Aug 2016 10:30 PM GMT
వాట్సప్‌ వినియోగదార్లకు కంగారు అక్కర్లేదు!
X
వాట్సప్‌ వాడే వారికి కొన్ని రోజులుగా ఆన్‌ చేయగానే 'అగ్రీ' అనే ఒక బటన్‌ కనిపిస్తోంది. ఇదేదో సాఫ్ట్‌వేర్‌ అప్‌ డేట్‌ లాంటిదే కదా.. అనుకుని చాలా మంది.. చూసీచూసుకోకుండా.. 'అగ్రీ' కొట్టేశారు. అయితే నిజానికి అలా చేయడం వల్ల మన వాట్సప్‌ సమాచారం మొత్తం ఫేస్‌బుక్‌ అకౌంట్‌ కు షేర్‌ అవుతుందిట. కాకపోతే.. మన ఫోను నెంబరును మాత్రం చెప్పకుండా సీక్రెట్‌గానే ఉంచుతారని, ఆ ఒప్పందం. అయితే 'అగ్రీ' కొట్టడానికి ముందే.. టర్మ్స్‌ కండిషన్స్‌ కోసం తర్వాతి పేజిలకి వెళితే.. అక్కడ ఫేస్‌ బుక్‌ కు సమాచారం ఇవ్వచ్చునా లేదా అనే చెక్‌ బాక్స్‌ ఉంటుంది. దాన్ని అన్‌ చెక్‌ తర్వాత అగ్రీ కొడితే సరిపోతుందని టెక్‌ నిపుణులు సోషల్‌ నెట్‌ వర్క్‌లో సలహాను ప్రచారంలో పెట్టారు.

అయితే ఈ సలహా ప్రాచుర్యంలోకి రావడానికి ముందే 'అగ్రీ' కొ ట్టేసిన వారి పరిస్థితి ఏమిటి? వారు తెలిసీ తెలియకుండా అగ్రీ కొట్టేయడం వలన, వారి సమాచారం ఫేస్‌ బుక్‌ కు షేర్‌ అవుతుంది కదా అని కంగారు పడాల్సిన అవసరం పెద్దగా ఏం లేదు. వారికి కూడా ఓ ఉపాయం ఉంది.

వాట్సప్‌ సెటింగ్స్‌ లో ప్రైవసీలోకి వెళితే.. అక్కడ ''షేర్‌ ఇన్‌ ఫర్మేషన్‌ టూ ఫేస్‌ బుక్‌'' అనే చెక్‌ బాక్స్‌ టిక్‌ పెట్టి ఉంటుంది. అక్కడ అన్‌ చెక్‌ చేసినా సరిపోతుంది. ఇన్ఫర్మేషన్‌ షేర్‌ కావడం ఆగడం మాత్రమే కాదు, ఆ ఆప్షన్‌ కూడా మాయమైపోతుంది. కాబట్టి.. 'అగ్రీ' బటన్‌ పొరబాట్న నొక్కేసిన వాళ్లు.. తమ సమాచారం మొత్తం ఫేస్‌ బుక్‌ లోకి వెళ్తూ ఉంటుందేమో అని కంగారు పడాల్సిన అవసరం లేకుండా.. ఈ ప్రకారంగా సెటింగ్స్‌లోకి వెళ్లి దాన్ని మార్చవచ్చు. తమ సమాచారం భద్రమే అని అనుకోవచ్చు.