హైకోర్టు ప్రశ్న: బిచ్చమెత్తితే తప్పేంటి?!!

Thu May 17 2018 11:11:52 GMT+0530 (IST)

రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం అవాక్కయ్యే పరిణామం చోటుచేసుకుంది. చట్టాన్ని అమలు చేయాలా..మానవతా దృక్పథంతో వ్యవహరించాలా అనే దర్మసంకటంలో న్యాయమూర్తులు పడిపోయారు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో ప్రజల సంక్షేమాన్ని పరిరక్షించాల్సిన రాష్ట్ర ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. ఇదంతా బిచ్చమెత్తుకోవడం గురించి. ఈ దీనమైన స్థితిని తమ హక్కుగా ఇవ్వాలనే వారి ఆవేదన వింటున్న సమయంలో ఘటన.ఈ పరిణామం చోటుచేసుకుంది ఢిల్లీ సర్వోన్నత న్యాయస్థానంలో అడుక్కోవడానికి చట్టబద్ధత కల్పించాలంటూ దాఖలైన రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గీతా మిట్టల్ - జస్టిస్ హరిశంకర్ తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఓ వ్యక్తి బిచ్చమెత్తుకుంటాడని అంతేగానీ అదేదో ఒక అవకాశంగా భావించి అడుక్కోడని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్రభుత్వం తిండిపెట్టదు.. పని ఇవ్వదు.. బిచ్చమెత్తితే తప్పేంటి? అది నేరం ఎలా అవుతుంది అని ఢిల్లీ హైకోర్టు కేంద్రప్రభుత్వాన్ని ప్రశ్నించింది. `మన దగ్గర డబ్బులు ఉంటే ఎందుకు అడుక్కుంటాం? కొందరు ఏమీ లేక.. చివరికి ఎటూతోచక కడుపు నింపుకోవడానికి ఒకరి దగ్గర చెయ్యి చాచాల్సి వస్తుంది. ప్రభుత్వం తిండి పెట్టక- ఉపాధి కల్పించనప్పుడు అడుక్కుంటే నేరం ఎలా అవుతుంది? ``అని ధర్మాసనం ప్రశ్నించింది. దీంతో స్పందించిన కేంద్రంతరఫు న్యాయవాది బాంబే యాచక నిరోధక చట్టంలో అడుక్కోవడం నేరం అనే పలు నిబంధనలు ఉన్నాయని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అయితే వీటికి మానవత దృక్పథంలో ఆచరణాత్మక పరిష్కారాలు చూపాలని కోర్టు ఆదేశించింది.