Begin typing your search above and press return to search.

గేదె కడుపున మొసలి: ఎక్కడ తేడా జరిగింది

By:  Tupaki Desk   |   7 Oct 2015 9:35 AM GMT
గేదె కడుపున మొసలి: ఎక్కడ తేడా జరిగింది
X
ప్రకృతిలో చాలా వింతలు జరుగుతుంటాయి... అస్సలు ఏమాత్రం ఊహకందని వింతలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తాయి. అదెలా సాధ్యమైందో అర్ధం కాక బుర్ర పగలగొట్టుకుని ఆలోచించి ఆలోచించి ఊరుకోవడం మినహా ఏమీ చేయలేం. కొబ్బరి కాయ కొండంత ఉందంటే సర్లే అనుకుని సర్దుకుపోతాం.... దొండ కాయ పొట్ల కాయ అంత పొడవు పెరిగింది అంటే అబ్బో అని ఆశ్చర్యపోతాం... కానీ కొన్ని వింతలు మాత్రం సృష్టి సహజ సూత్రాలకే సవాల్ విసురుతుంటే మాత్రం అవాక్కవ్వాల్సిందే. థాయ్ లాండ్ లో అలాంటి వింతే జరిగింది... అది మామూలు వింత కాదు.. వింతలకే వింత అంటున్నారు అక్కడివారు. ఎక్కడో తేడా జరిగింది అని సాధారణ ప్రజలు అనుకుంటుంటే శాస్త్రవేత్తలు మాత్రం హైబ్రీడ్ ప్రయోగాల్లో తేడా వస్తే ఇలాగే జరుగుతుందని తేల్చేస్తున్నారు.

నదులు... మడుగుల్లో అక్కడక్కడా పెరిగే రెల్లగడ్డిని, తుంగను తినడానికి వెళ్లే గేదెలను అక్కడ మాటువేసే మొసళ్లు మెడ కరిచి ముక్కముక్కలుగా పీక్కు తింటాయి. కానీ, అలాంటి భయంకరమైన మొసలే గేదె కడుపులో పుడితే....!!! వింతంటే అదే. థాయ్‌లాండ్‌లోని ఓ మారుమూల గ్రామంలో ఇలాంటి విచిత్రమే జరిగింది. గేదెకు జన్మించినది దూడలా లేకుండా అచ్చంగా మొసలిలా ఉండడంతో గ్రామస్థులు షాక్ తిన్నారు. మొఖం నుంచి తోక వరకు మొసలిలా ఉన్నా కాళ్లు మాత్రం గేదె కాళ్లలా ఉన్నాయి.

అయితే... దీనికి సైంటిస్టులు మాత్రం సమాధానం చెబుతున్నారు. గేదె కడుపున మొసలి జన్మించడం అసాధ్యమని.. అయితే.... ఆ గేదెకు జన్మించిన దూడ ఆకారం మొసలిని పోలి మాత్రమే ఉందని... పశువుల్లో కృత్రిమ గర్భోత్పత్తి చేసేటప్పుడు చేసే సంకరజాతి ప్రయోగాలు వికటిస్తే ఇలాటి విచిత్ర ఆకారంలో దూడలు జన్మిస్తాయని చెబుతున్నారు. కాగా ప్రపంచమంతా దీన్ని వింతగా భావిస్తుంటే గ్రామస్థులు మాత్రం ఇంకో ఆలోచనతో ఉన్నారు.... ఈ వింత ఆకారం తమ గ్రామంలో జన్మించడం ఏదో చెడు జరగబోతోంది అని చెప్పడానికి సంకేతమంటూ వారంతా ఆందోళన చెందుతున్నారు.