Begin typing your search above and press return to search.

మా ఆట‌గాడిని భార‌త్‌ కు ఇచ్చేది లేదు

By:  Tupaki Desk   |   26 May 2018 5:29 PM GMT
మా ఆట‌గాడిని భార‌త్‌ కు ఇచ్చేది లేదు
X
ఐపీఎల్ మ్యాచ్‌ లో ఇటు ఆట‌తీరుతో..అటు గొప్ప‌మ‌న‌సుతో అంద‌రి అభిమానాన్ని సొంతం చేసుకున్న క్రీడాకారుడు ర‌షీద్‌. IPL 11 సీజన్ లో అద్భుతమైన ఆటతీరుతో క్రికెట్ అభిమానుల మనస్సు గెలుచుకున్నాడు. ఆప్ఘ‌నిస్తాన్ కుర్రోడు అయినా.. హైదరాబాద్ ను ఫైనల్ కు చేర్చటంలో కీలకపాత్ర పోషించాడు.మ్యాచ్ ఫీజు కాకుండా అద్భుతమైన ఫెర్మార్మెన్స్ తో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎన్నికై.. తనకు వచ్చిన డబ్బును మిత్రులకు - ఆప్ఘ‌న్ లో బాంబు పేలుళ్లలో గాయపడిన వారికి విరాళంగా ఇచ్చి చిన్న వయస్సులో ఇంత పెద్ద మనస్సు ఉన్నోడిగా అందరి మన్ననలు పొందుతున్నాడు. అందుకే రషీద్ అంటే ఇప్పుడు అందరూ వాహ్ వా అని కీర్తిస్తున్నారు. ఇటు ఆట‌తీరు..అటు మంచిత‌నంతో ఆక‌ట్టుకున్న ర‌షీద్‌కు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ అయిపోయారు. పలువురు అభిమానులు రషీద్‌ ను టీమిండియాకు ఇచ్చేయాలంటూ కోరారు. ‘‘ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డుతో బీసీసీఐ ఓ ఒప్పందం చేసుకోవాలి. ఆ ఒప్పందం ప్ర‌కారం రవీంద్ర జ‌డేజాను ఆఫ్ఘనిస్తాన్‌ కు ఇచ్చేసి.. ర‌షీద్‌ను ఇండియా త‌ర‌ఫున ఆడించాలి’’ అంటూ ట్వీట్లు చేశారు.రషీద్.. క్రికెటర్ గానే కాకుండా పెద్ద మనస్సున్నోడుగా కూడా అందరితో శెభాష్ అనిపించుకుంటున్న నేప‌థ్యంలో ఆప్ఘ‌నిస్తాన్ అధ్య‌క్షుడు ఓ స‌ర‌దా ట్వీట్ చేశారు.

ఐపీఎల్ 11 సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున ఆడుతున్నాడు. స్పిన్నర్. ఈ సీజన్ లో మొత్తం 16 మ్యాచ్ లు ఆడి.. 384 బాల్స్ వేసి.. 434 రన్స్ ఇచ్చి.. 21 వికెట్లు తీసి టాప్ 2లో నిలిచాడు. రషీద్ బౌలింగ్ వల్లే సన్ రైజర్స్ ఫైనల్ కు వెళ్లింది. సెమీఫైనల్ లాంటి కీలకమైన మ్యాచ్ లో కోల్ కతాను కట్టడి చేశాడు. షారూఖ్ ఖాన్ టీంని ఇంటికి పంపించాడు. సన్ రైజర్స్ ను ఫైనల్ కు చేర్చాడు. ఈ నేప‌థ్యంలో ప‌లువురు క్రేజీ ట్వీట్లు చేశారు. రషీద్‌కు భార‌త పౌర‌స‌త్వం ఇవ్వాల‌ని కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వ‌రాజ్‌ కు ట్వీట్లు చేయ‌గా... ‘‘మీరంద‌రూ చేస్తున్న ట్వీట్లు చూస్తున్నాను. ఆ విష‌యాన్ని కేంద్ర హోం శాఖ చూసుకుంటుంది’’ అని ఆవిడ బదులిచ్చారు. ఇలా వార్తల్లో అంశంగా నిలిచిన ర‌షీద్‌ పై ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ స్పందించారు. ‘‘మా హీరో పట్ల ఆఫ్ఘనిస్తాన్ గర్వంగా ఫీలవుతోంది. మా ఆటగాళ్ల ప్రతిభను ప్రదర్శించడానికి వేదిక కల్పిస్తున్న భారతీయ మిత్రులకు కృతజ్ఞతలు`` అంటూ త‌న సంతోషాన్ని ఆప్ఘ‌న్ అధ్య‌క్షుడు వ్య‌క్తం చేశారు. ఈ సంద‌ర్భంగానే ``ఆఫ్ఘనిస్తాన్ అంటే ఏంటో రషీద్ మళ్లీ గుర్తుచేశాడు. క్రికెట్ ప్రపంచానికి రషీద్ ఆసక్తికరమైన వ్యక్తిగా మారాడాని, అతన్ని వదులుకోబోము’’ అంటూ ప్రధాని నరేంద్ర మోడీకి సరదాగా ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైర‌ల్ అయింది.

ముంబై ఇండియన్స్ పై సన్ రైజర్స్ గెలిచి.. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎంపిక‌యిన ర‌షీద్ ఈ సమయంలో వచ్చిన డబ్బును బాంబు దాడిలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన స్నేహితుడు, అతడి కుమారుడికి ఖర్చు నిమిత్తం అందజేశాడు. ఒక్క పైసా నాకు వద్దని గ్రౌండ్ సాక్షిగా ప్రకటించి.. తన గొప్ప మనస్సు చాటుకున్నాడు. అంతేనా.. సెమీఫైనల్ మ్యాచ్ లో కోల్‌కతాపై గెలిచి.. మ్యాచ్ ఆఫ్ ద మ్యాచ్ గా ఎంపిక అయిన తర్వాత.. రూ.5లక్షల నగదు బహుమతి వచ్చింది. ఈ మొత్తాన్ని కూడా విరాళంగా ఇచ్చాడు రషీద్. ఆప్ఘ‌న్ లోని జలాలాబాద్ క్రికెట్ గ్రౌండ్ లో బాంబు పేలింది. ఆరుగురు చనిపోతే.. చాలా మంది గాయపడ్డారు. ఆ బాధితులకు ఈ రూ.5 లక్షలు విరాళంగా అందించాడు. దీంతో సోషల్ మీడియాలో ఐపీఎల్ హీరో అయిపోయాడు రషీద్ ఖాన్.