Begin typing your search above and press return to search.

చంద్రబాబుకు జల శాపం

By:  Tupaki Desk   |   16 July 2018 1:20 PM GMT
చంద్రబాబుకు జల శాపం
X
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి జల శాపం వేధిస్తోంది. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నప్పటినుంచి నీటి రూపంలో కష్టాలను ఎదురుకుంటున్నారు. చంద్రబాబు నీటి శాపం వలన అమాయకులైన రైతులు - అన్నెం పున్నెం ఎరుగని చిన్నారులు - పుణ్యం కోసం వచ్చిన భక్తులు - చివరకు ఆహ్లదం కోసం వచ్చిన పర్యాటకులూ మరణిస్తున్నారు. మామను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన తొలిసారి సమైక్య ఆంధ్రప్రదేశ్ ని అనావృష్టి దెబ్బ తీసింది. చంద్రబాబు ఏలికలో ఆ కాలమంతా వర్షాలే లేవు. రైతులు నింగివైపు చూపులు చూస్తూ వర్షమో రామచంద్రా అంటూ కాలం వెల్లదీసారు. ఈ అనావృష్టితో వర్షాలు పడక పండిన పంటకు గిట్టుబాటు ధరలేక వందాలది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ దశలో చంద్రబాబు నాయుడు ఏకంగా వ్యవసాయమే దండగ అన్నారు.

చంద్రబాబు నాయుడు రెండో దఫా ముఖ‌్యమంత్రి అయినప్పడు కూడా ఆంధ్రప్రదేలో ఇదే పరిస్దితి. పైగ వ్యవసాయం తప్ప ఇతర రంగాలపైనే శ్రద్ద కనబరచడంతో రాష్ట్రంలో వ్యవసాయం కుదేలైెయింది. రైతులు వలస కూలీలుగా మారుపోయారు. ఒకప్పటి అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ వర్షాలు లేక ఎండిపోయింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం - వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ‌్యమంత్రి కావడంతో పరిస్దితిలో మార్పు వచ్చింది. అంతవరకూ చుక్క కూడా వర్షం పడని రాష్ట్రంలో ఇబ్బడిముబ్బిడిగా వానలు కురిసాయి. రైతుల కళ్లలో వెలుగులు కనిపించాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా అధిక ప్రాధాన్యం ఇవ్వడంతో వారి జీవిక మెరుగైంది.

రాష్ట్రం విడిపోయి ఆంధ్ర రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ‌్యమంత్రి అయిన తర్వాత నీటి శాపం మరో రూపంలో ఆంధ్ర ప్రజలను వెంటాడుతోంది - గోదావరి పుష్కరాల సంధర్భంగా చంద్రబాబు నాయుడి మెహర్బానీ కారణంగా పుణ్యస్నానాలకు వచ్చిన 30 మంది భక్తులు తొక్కిసలాటలో మరణించారు. ఆ తర్వాత కొన్నాళ్లకు క్రిష్ణా నదిలో బోటు ప్రమాదంలో మరో 14 మంది మరణించారు. ఈ రెండు సంఘటనలకు రాష్ట్ర ప్రభుత్వం - చంద్రబాబు నాయుడిదే పూర్తి బాధ్యత. ఇక ఆహ్లాదం కోసం పాపికొండలకు వెళ్లిన పర్యాటకుల బోటు మునిగింది. ఈ ప్రమాదంలో దాదాపు 40 మంది మరణించారు. ప్రమాదానికి గురైన బోటుకు ఎటువంటి అర్హతలు - అనుమతులు లేవు. ఇంతటి ప్రమాదం జరిగిన ముఖ‌్యమంత్రి చంద్రబాబు నాయడు కాని పర్యాటక శాఖ మంత్రి అఖిల ప్రియ కాని పెద్దగా స్పందించలేదు. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన పడవ ప్రమాదంలో పదిమంది చిన్నారుల గల్లంతు అయ్యారు. వారికోసం గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇలా చంద్రబాబు నాయుడి హయాంలో నీటి శాపం తెలుగు ప్రజలను వేధిస్తోంది.