Begin typing your search above and press return to search.

ఓట‌రు కార్డు లేదా... నో ప్రాబ్లం !

By:  Tupaki Desk   |   6 Dec 2018 3:39 PM GMT
ఓట‌రు కార్డు లేదా... నో ప్రాబ్లం !
X
చాలామంది... ఓట‌రు కార్డు లేక‌పోతే ఓటేయ‌లేం అనుకుంటారు. దానిని నిర్ద్వందంగా కొట్టిపారేశారు తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమార్‌. ఓట‌రు ఎటువంటి ఇబ్బంది ప‌డ‌కుండా ఓటేసి వెళ్ల‌డానికి అన్ని ఏర్పాట్లు చేసిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.

ఓట‌రు కార్డు క‌చ్చితంగా ఉండాల‌నేం లేదు. ప్రభుత్వం గుర్తించిన 12 ఐడీ కార్డులలో ఏది ఉన్నా స‌రిపోతుంది అని ఆయ‌న చెప్పారు. అయితే, మీకు ఓట‌రు కార్డు లేక‌పోయినా ఓటు ఉండాలి సుమా. ప్ర‌తి ఓట‌రుకు ఇప్ప‌టికే స్లిప్‌ ల‌ను కూడా అంద‌జేశారు. ప్ర‌తి ఇంటికి స్లిప్‌లు చేరాయి. గురువారం సాయంత్రానికే సిబ్బంది ఆయా పోలింగ్ బూత్‌ ల‌కు చేరుకున్నారని ర‌జ‌త్‌ కుమార్ తెలిపారు.

హైలైట్స్ ఇవే..

* మావోయిస్టు ప్రభావిత 13 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్‌.

* మిగిలిన 106 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు ఓటు వేయొచ్చు.

* ఈ ఎన్నికల్లో కొత్త ఓట‌ర్లు 20 లక్షల మంది.

* పాస్‌ పోర్ట్ - డ్రైౖవింగ్‌ లైసెన్స్ - కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగులకు జారీచేసిన గుర్తింపు కార్డులు - బ్యాంకులు - పోస్టాఫీసులు ఫొటోలతో జారీ చేసిన పాస్‌ పుస్తకాలు - పాన్‌ కార్డు - ఆధార్‌ కార్డు - ఎన్‌ ఆర్‌ ఈజీఎస్‌ జాబ్‌ కార్డ్ - కార్మిక శాఖ జారీ చేసిన హెల్త్‌ ఇన్సూరెన్స్‌ స్మార్ట్‌ కార్డ్ - ఫొటోతో ఉన్న పెన్షన్‌ ధ్రువీకరణ పత్రం - ఎన్నికల యంత్రాంగం జారీ చేసిన ఫొటో ఓటర్‌ స్లిప్ - ఎన్‌ పీఆర్‌ కింద ఆర్‌జీఐ జారీ చేసిన స్మార్ట్‌ కార్డ్ కార్డుల‌ను చూపించి ఓటు వేయొచ్చు.

* సాయంత్రం 5 గంట‌ల్లోపు క్యూలో ఉంటే చాలు. లేట‌యినా ఓటు వేయ‌నిస్తారు.

* తెలంగాణ‌లో తొలిసారి వీవీపాట్ మిష‌న్ వాడుతున్నారు. ఇందులో మీ ఓటు ఎవ‌రికి ప‌డిందో చూసుకోవ‌చ్చు.

* పోలింగ్ బూత్‌ లోకి సెల్ ఫోన్ తీసుకెళ్ల‌కూడ‌దు.