Begin typing your search above and press return to search.

జగన్ పై వ్యాఖ్యలకు ‘రాజు’ పశ్చాత్తాపం

By:  Tupaki Desk   |   28 March 2017 6:03 PM GMT
జగన్ పై వ్యాఖ్యలకు ‘రాజు’ పశ్చాత్తాపం
X
తొందరపడి నోరు జారటం ఈ మధ్యన అలవాటుగా మారింది. ఏపీ అధికారపక్షనేతల మాదిరి బరి తెగింపు ధోరణనిని ప్రదర్శించకుండా.. జరిగిన దానికి బాధను వ్యక్తం చేయటం.. ఆవేదనను వెల్లడించటం లాంటివి కొందరు చేస్తుంటారు.మనసులో అనిపించింది..అనిపించినట్లుగా చెప్పేయటం.. అధికారం.. విపక్షం అన్న తేడా లేకుండా ఎవరిపైనైనా చెప్పాలనుకున్న మాటల్నిచెప్పేసే తత్త్వం బీజేపీ శాసనసభాపక్షనేత విష్ణుకుమార్ రాజు సొంతం. తాజాగా ఆయన తెగ ఫీలవుతున్నారు. ఏపీ విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నోరు జారిన ఆయన.. ఇప్పుడు ఆ విషయంపై ఫీలైపోతున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతపై తాను చేసిన వ్యాఖ్యలపై తనకే బాధనిపిస్తోందన్న ఆయన.. తాను అలా మాట్లాడకుండా ఉండాల్సిందన్న ఆవేదనను వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రిపైనా.. అధికారపక్షంపైనా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఢిల్లీ నుంచి బీజేపీ పెద్దల్ని ఏపీ అసెంబ్లీకి తీసుకురావాలంటే సిగ్గేస్తుందన్నారు. బీజేపీ ఎల్పీ కార్యాలయం అష్టవంకర్లతో ఉందని.. చివరకు బాత్రూం సౌకర్యం కూడా లేదన్నారు. బీజేపీఎల్పీకి కేటాయించిన భవనాన్ని చూస్తే.. తనది చేతకానితనం అని ఢిల్లీ పెద్దలు ఫీలయ్యే అవకాశం ఉందని.. అందుకే తాను ఎవరినీ ఏపీ అసెంబ్లీకి రమ్మని ఆహ్వానించటం లేదన్నారు.

తమ కార్యాలయానికి బాత్రూంలేదన్న విషయాన్ని మంత్రుల దృష్టికి తీసుకెళితే.. తమకూఅదే పరిస్థితని.. ఆరుగురు మంత్రులకు ఒక బాత్రూం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.ఆరుగురు మంత్రులకు ఒకే బాత్రూం కేటాయించటం దారుణమన్న ఆయన.. స్కూళ్లు.. కాలేజీలు కట్టినట్లుగా అసెంబ్లీ భవనాన్ని నిర్మించారంటూ దుయ్యబట్టారు. కావాలంటే అద్దె చెల్లిస్తానని.. మంచి రూమ్ కేటాయించాలన్నారు. అయినా.. మిత్రుడికి ఇలాంటి రూమ్ ను కేటాయించటం ఏమిటి..?


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/