గంటా గెలిచే అవకాశమే లేదట..!

Tue May 21 2019 09:49:19 GMT+0530 (IST)

విశాఖ నార్త్ నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన మంత్రి గంటా శ్రీనివాసరావు నెగ్గే అవకాశమే లేదని అంటున్నాడు అదే నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేసిన విష్ణుకుమార్ రాజు. ఆ నియోజకవర్గంలో పరిస్థితి గురించి విష్ణుకుమార్ రాజు తన వెర్షన్ చెప్పుకొచ్చారు.విశాఖ నార్త్ నుంచి గెలిస్తే తను గెలవాలని లేదా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నెగ్గాలి గంటా శ్రీనివాసరావు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవలేరు.. అని ఈ కమలం పార్టీ నేత తేల్చి చెప్పారు.

గంటా శ్రీనివాసరావు ఓడిపోతాడు.. తను గెలుస్తాను.. అంటూ ఈయన చెప్పుకురావడం లేదు. తను గెలిచినా గెలవకపోయినా గంటా శ్రీనివాసరావు మాత్రం ఓడిపోతారని ఈయన చెప్పుకొస్తున్నాడు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి  అయినా గెలుస్తాడేమో కానీ గంటాకు మాత్రం అవకాశం లేదని ఈయన అంటున్నాడు.

ఏపీలో భారతీయ జనతా పార్టీ పరిస్థితి గురించి విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ తాము ఒక్క ఎంపీ సీట్లో కూడా నెగ్గే అవకాశం లేదని తేల్చాడు. మూడు అసెంబ్లీ సీట్లలో మాత్రం గట్టి పోటీ ఇచ్చినట్టుగా చెప్పుకొచ్చారు. కేంద్రంలో మాత్రం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే ఏర్పడుతుందని బీజేపీ సొంతంగా రెండు వందల ఎనభై ఎంపీ సీట్లను సొంతం చేసుకుంటుందని విష్ణుకుమార్ రాజు చెప్పుకొచ్చారు.