బాబుకు కొత్త జబ్బు..ప్యాథలాజికల్ లయ్యింగ్

Thu Nov 08 2018 16:55:47 GMT+0530 (IST)

 
ఏపీ సీఎం చంద్రబాబునాయుడి కి అల్జీమర్స్ ఉందని.. అందుకే ఆయన చెప్పిందే చెబుతూ విసిగిస్తుంటారని చాలాకాలంగా పలువురు నేతలు చెబుతున్నారు. తాజాగా ఆయనకు మరో జబ్బు కూడా ఉందని వైసీసీ రాజ్యసభ ఎంపీ విజయ సాయి రెడ్డి చెబుతున్నారు. అందుకు ఆధారాలు కూడా చూపుతున్నారాయన.
  
చంద్రబాబు అల్జిమర్స్ జబ్బుతో బాధపడుతున్నారని అల్జిమర్స్ చివరి దశకు వచ్చేసిందని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు చాలాకాలంగా చెబుతున్నారు. కానీ ఇప్పుడు విజయ సాయి రెడ్డి చెబుతున్న ప్రకారం చంద్రబాబు పాథలాజికల్ లయ్యింగ్ అనే మానసిక రుగ్మతతో ఇబ్బంది పడుతున్నారట.
  
తాజాగా విజయ సాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబులో పాథలాజికల్ లయ్యర్ అనే సమస్య తీవ్రస్ధాయికి చేరుకుందని చెప్పారు. చంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పటం - అబద్దాల వర్షం ఎందుకు కురిపిస్తారో సైకాలజిస్టులు గుర్తించారని ఆయన అన్నారు.  ఈ రోగానికి నివారణ కూడా ఉందని సైకాలజిస్టులు చెప్పారట. కట్టుకథలు అల్లటం అసత్యాలు చెప్పటం - అబద్దాలను చెబుతే వాటినే నిజాలుగా నమ్మించే ప్రయత్నాలు చేస్తుండడం ఈ వ్యాధి లక్షణాలట.
  
హుద్ హుద్ ను  జయించానని చెప్పటం - తిత్లీ తుపాను ప్రభావాన్ని తగ్గించేశామని చెప్పటం - సముద్రాన్ని కంట్రోల్ చేసేశానని ప్రకటించటం - అమరావతిలో ఒలంపిక్స్ నిర్వహించాలని చెప్పటం లాంటి చంద్రబాబు ప్రకటనలన్నీ ఈ జబ్బుకు ఉదాహరణలని విజయ సాయి రెడ్డి చెబుతున్నారు.