విజయసాయిరెడ్డి ట్వీట్ కు బాబు మైండ్ బ్లాంకే

Fri Nov 09 2018 12:00:18 GMT+0530 (IST)

ఏపీ ముఖ్యమంత్రి - తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై వైఎస్ ఆర్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి - రాజ్యసభ సభ్యులు విజయ సాయి రెడ్డి ఊహించని రీతిలో విరుచుకుపడ్డారు. బాబు మానసిక వ్యాధితో బాధపడుతున్నారని విమర్శించారు. నిరంతరం కట్టుకథలు అల్లుతూ..అసత్యాలే నిజాలుగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి మానసిక జబ్బున పడిన వారిని ఇంటికి పరిమితం చేయాలని సూచించారు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.విశాఖ భూకుంభకోణంపై సిట్ నివేదికపైనా విజయ సాయి రెడ్డి తనదైన శైలిలో స్పందించారు. `భూ కుంభకోణంపై బాబు స్వీయ దర్శకత్వంలో తయారైన ‘హిజ్ మాస్టర్స్ వాయిస్’లా ఉంది. కుంభకోణంలో విలన్ పాత్రధారులైన ‘ఎల్లో మాఫియా గ్యాంగ్’లో ఒక్కరి పేరు లేకుండా జాగ్రత్తలు తీసుకుని ‘మాస్టర్’ పట్ల తిరుగులేని విశ్వాసాన్ని చాటుకుంది సిట్`` అంటూ ఓ ట్వీట్ లో ఎత్తిపొడిచారు. ``రిషితేశ్వరి మరణం - వనజాక్షిపై దాడి - నారాయణ - చైతన్య కాలేజీల్లో విద్యార్ధుల ఆత్మహత్యలు - పుష్కరాల్లో తొక్కిసలాట - లాంచి ప్రమాదం - రత్నాచల్ రైలు దగ్ధం - కాల్ మనీ రాకెట్ - విశాఖ భూకుంభకోణం వరకు జరిపిన విచారణల్లో నిజమైన దోషిని ఒక్కరిని పట్టుకోలేదు - శిక్షించలేదు. ఇవే బాబు మార్క్ విచారణలు!`` అంటూ తనదైన శైలిలో విజయ సాయి రెడ్డి నివేదికపై స్పందించారు.

కాగా రాజకీయాల్లో చంద్రబాబు డబుల్ స్టాండర్డ్స్‌ను సైతం ఆయన ఎద్దేవా చేశారు. ``చంద్రబాబు బీజేపీతో కాపురం చేసినపుడు జగన్ గారిది పిల్ల కాంగ్రెస్ - సేమ్ DNA అని అంటాడు. అదే బాబు కాంగ్రెస్ తో దోస్తీ చేస్తే YSRCP బిజెపీతో కుమ్మక్కయిందంటాడు. తన అవకాశవాదానికి అనుగుణంగా అవతలి వాళ్లపైన బురద జల్లుతాడు. పొలిటిల్ బ్రోకర్ కళ్లకు అందరూ అట్లాగే కనిపిస్తారేమో?`` అంటూ సూటిగా పంచ్ వేశారు.