Begin typing your search above and press return to search.

అక్రమ కొంప మునగొద్దనే కుట్ర స్టోరీలు తెర మీదకు?

By:  Tupaki Desk   |   20 Aug 2019 8:49 AM GMT
అక్రమ కొంప మునగొద్దనే కుట్ర స్టోరీలు తెర మీదకు?
X
ప్రపంచంలో ఏ ప్రముఖుడు కూడా తాను అద్దెకు ఉండే ఇంటి కోసం ఇంతగా యాగీ చేసి ఉండరేమో? నదీ సమీపాన.. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన నిర్మాణంలో అద్దెకు ఉండటమే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేయకూడదు. అదంతా ఒక ఎత్తు అయితే.. నిర్మాణం రూల్స్ ను బ్రేక్ చేసి నిర్మించిందన్న విషయంపై విమర్శలు వచ్చినంతనే.. దాన్ని ఖాళీ చేసేసి మరోచోటకు షిఫ్ట్ అయితే బాగుండేది.

కానీ.. తన రాజకీయ ప్రత్యర్థులు తప్పులు ఎత్తి చూపించిన తర్వాత ఇల్లు మారితే తన ప్రతిష్ఠకు భంగమన్నట్లుగా ఫీలై.. అదే ఇంట్లో కంటిన్యూ కావటమే కాదు..చూద్దాం.. ఎవరొచ్చి ఖాళీ చేస్తారన్నట్లుగా వ్యవహరించటం అర్థం లేనిది. బాబుకు తగ్గట్లే ఆయన మందీ మార్బలం సైతం తమ అధినేత అద్దెకు ఉండే అక్రమ నిర్మాణం గురించి అదే పనిగా యాగీ చేయటం తెలుగు ప్రజలకు చిరాకు తెప్పిస్తోంది.

ఒకవైపు వరద నీరు కారణంగా వందలాది ఇళ్లల్లోకి వరద నీరు వచ్చేయటంపై ఆవేదన వ్యక్తం చేస్తుంటే.. అర్థం లేని డిమాండ్లను తెర మీదకు తెచ్చి ఇష్యూను డైవర్ట్ చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. ఇలాంటి వేళ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ నేత విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో ఆసక్తికర ట్వీట్ చేశారు. ప్రస్తుతం నెలకొన్న తాజా పరిస్థితిని ఉద్దేశిస్తూ ఆయన ట్విట్టర్ లో ట్వీట్ చేశారు.

ఎగువ నుంచి వచ్చే వరద ప్రవాహాన్ని అంచనా వేసి కిందకు ఎంత వదలాలి అన్నది ఇరిగేషన్ ఇంజనీర్లు నిర్ణయిస్తారని.. డ్యాం.. బ్యారేజీల భద్రత వారికి ముఖ్యమని.. బ్యారేజీ దిగువ ప్రజలు బలైపోయినా ఫర్లేదు కానీ తన అక్రమ కొంప మునిగేందుకు వీల్లేదంటూ కుట్రల స్టోరీల్ని తెర మీదకు తెస్తున్నారంటూ చంద్రబాబు తీరును తీవ్రంగా తప్పు పట్టారు. నిజమే.. వరద నీరు పోటెత్తుతున్న వేళ.. దాని కారణంగా ఇబ్బంది పడే సామాన్యుల గురించి ఆలోచించటం కంటే కూడా చంద్రబాబు అద్దెకు వుండే నివాసం గురించి ఎక్కువగా మాట్లాడటం అర్థం లేదనే చెప్పాలి.