Begin typing your search above and press return to search.

రవిప్రకాష్ చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు!

By:  Tupaki Desk   |   9 Oct 2019 6:19 AM GMT
రవిప్రకాష్ చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు!
X
బండ్లు ఓడలు - ఓడలు బండ్లు అవుతాయనడానికి రవిప్రకాశ్‌ ఆలియాస్‌ ఖైదీ నెంబర్‌ 4412నే ప్రత్యక్ష ఉదాహరణ. టీవీ9 సామ్రాజ్యం తన ఒక్కడి వల్లే నిర్మితమైందని చెప్పుకునే రవిప్రకాశ్‌... ఆ సామ్రాజ్యంలో ఎంత మంది ఆకలి కేకలకు - మరెంత మందో కన్నీళ్లకు కారణమయ్యాడు. నెంబర్‌ వన్‌ చానల్‌ అని చెప్పుకునే తన సామ్రాజ్యంలో కనీసం కనికరం లేకుండా... క్షణాల్లో ఉద్యోగాలు పీకేసిన సందర్భాలు కోకొల్లలు. ఇన్‌ పుట్‌ - అవుట్‌ పుట్‌ డెస్క్‌ ల్లో అయితే ఎంత మంది మారారో లెక్క పెట్టడం అంత ఈజీ కాదు.

అవినీతి రహిత - మెరుగైన సమాజం ముసుగులో tv9 పేరు తో రవిప్రకాష్ - మూర్తి - క్లిఫర్డ్ పెరారీ ల 18 కోట్ల దోపిడి అధారాలతో సహా అడ్డంగా దొరికి పోయి ప్రస్తుతం రిమాండ్ ఖైదీ గా చంచల్ గూడ జైల్లో వున్నాడు రవిప్రకాష్. అయుతే ఇప్పుడు ఆయన మెడ చుట్టూ ఈడి - సీబిఐ - మనీ లాండరింగ్ - బ్లాక్ మెయిలింగ్ కేసులు కూడా చుట్టుకోనున్నాయా అంటే అవుననే అంటున్నాయి మీడియా వర్గాలు.

ఇప్పటికే రవిప్రకాష్ పై 420 - 418 - 409 సెక్షన్లు కింద కేసులు నమోదయ్యాయి. తాజాగా Tv9 బహిష్కృత CEO రవిప్రకాష్ పై ఆస్తులపై EDవిచారణ - రవిప్రకాష్ స్కాం లపై CBI విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు వైసిపి రాజ్యసభ ఎంపీ విజయ సాయి రెడ్డి రాసిన లెటర్ ఇప్పుడు మీడియా తో పాటు రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. ఫెమా - ఆర్బీఐ రెగ్యులేషన్ - మనీ లాండరింగ్ లతో పాటు ఇన్ కంటాక్స్ ఎగ్గొట్టడం ద్వారా రిమాండ్ లో వున్న రవిప్రకాష్ అక్రమాస్తులు కూడగట్టాడంటూ‌ విజయ సాయి రెడ్డి పేల్చిన బాంబు పై ఇప్పుడు ఆధారాలు వేగంగా సేకరిస్తున్నారు.

దీనికి తోడు రవిప్రకాష్ తెలుగు రాష్ట్రాలలో దందాలతో పాటు అంతర్జాతీయ స్థాయిలో బ్యాంకుల ను మోసం చేసిన మొయిన్‌ కురేషి తోను - CBI కేసులో ఇప్పటికే విచారణ ఎదుర్కొంటున్న సానా సతీష్ తో కలసి‌ చాలా మందిని‌ మోసం చేసారని తన లేఖలో‌ ఆధారాలతో పేర్కొన్న విజయ సాయిరెడ్డి దీనిపై హోం మంత్రి అమిత్ షా కు కూడా లేఖ రాసే అవకాశాలున్నాయని చెప్పుకుంటున్నారు. అమెరికాలో కమ్మ సంఘాలతో సంబరాలు జరిపే సతీష్ సానా - మొయిన్ కురేషి - రవిప్రకాష్ ముగ్గురు కలసి నకిలీ డాక్యుమెంట్ లతో హైదరాబాద్ లోని నగల వ్యాపారి ముసద్దీలాల్ సుఖేష్ గుప్త ను బెదిరించి హవాలాకు పాల్పడ్డారని దానిపై కూడా విచారణ జరపాలని విజయ సాయి రెడ్డి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ను కోరారు.

Tv9 సీఈఓ వున్నన్ని రోజులు ఇక్కడి అక్రమ సంపాదనతో‌పాటు - లాండ్ సెటిల్‌ మెంట్లు - బెదిరింపులు - సొంత సంస్థ కే కన్నం వేసి‌ సున్నం‌పూసి సంపాదించిన అక్రమ సొమ్ములతో రవిప్రకాష్ ఆఫ్రికా లో పెట్టిన పెట్టుబడులను ఆధారలతో సహా బయటపెట్టాడు వైసీపి ఎంపీ విజయ సాయి రెడ్డి. హవాలా సొమ్ములను కెన్యా - ఉగాండా లో రవిప్రకాష్ కంపాల సిటీ కేబుల్ లో పెట్టుబడులు పెట్టాడని - అవినీతి వ్యాపారాల జాబితాను - పలు సంస్థల్లో పెట్టిన షేర్ల వివరాలను ఆధారాలతో సహా చీఫ్ జస్టిస్ కు లేఖ లో తెలిపిన విజయ సాయి రెడ్డి ఫిర్యాదుపై ఎలాంటి యాక్షన్ వుంటుందో అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. మనీ లాండరింగ్ సొమ్ములతో తన భార్య దేవిక పేరు తో వివిధ పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించిన RP ఫ్యాక్టరీ సంస్థలలోకి ఆ నిధులను రవిప్రకాష్ పెట్టుబడు పెట్టారనే దానిపై ఉచ్చు బిగుస్తోంది.