మాల్యా గోల్డెన్ టాయ్ లెట్ చూసి షాకయ్యా!

Sat Aug 11 2018 11:03:11 GMT+0530 (IST)

బంగారు కంచాలను మంచాలను చూశాం.. కానీ బంగారు మరుగుదొడ్డిని ఎక్కడైనా చూశారా.? అంతటి విలువైన బంగారంతో మరుగుదొడ్డి కట్టించుకోవడమే ఒక అసహ్యమైన పని.. ఇక దాన్ని వాడడం అంటే మరెంత గలీజో.. కానీ దేశంలోని బ్యాంకులకు పదివేల కోట్లకు పైగా ఎగ్గొట్టి విదేశాలకు చెక్కేసిన విజయ్ మాల్యా.. ఇలా ప్రజల సొమ్ముతో పాపపు పనులు చేస్తున్నట్టు తాజాగా బహిర్గతమైంది. లండన్ లో ఉంటున్న విజయ్ మాల్యా లగ్జరీ జీవితం గురించి ప్రముఖ రచయిత  ప్రొఫెసర్ జేమ్స్ క్రాబ్ ట్రీ సంచలన వ్యాఖ్యలు చేశారు. లండన్ లో ఉన్న మాల్యాను ఇటీవల కాలంలో కలవడానికి వెళ్లినప్పుడు ఆయన ఇంట్లో చూసిన ఓ దృశ్యం తనను షాక్ కు గురిచేసిందని జేమ్స్ చెప్పుకొచ్చాడు. ‘లండన్ లోని మాల్యా ఇంట్లో నాలుగు గంటలున్నా.. అప్పుడు మల్యా మద్యం తాగుతూ కేసుల గురించి బాధపడుతూ కనిపించారు.  ఆ తర్వాత టాయ్ లెట్ కోసం వాష్ రూమ్ కు వెళ్లాను. అక్కడ ఉన్న బంగారంతో తయారు చేసిన మరుగుదొడ్డిని చూసి షాక్ అయ్యాను’ అని  వెల్లడించారు. దానికి బంగారంతో చేసిన రిమ్ - మూత కూడా ఉందంటే మాల్యా వైభోగాలు ఏపాటివో అర్థం చేసుకోవచ్చని ఆయన తెలిపారు. వీటన్నింటిని చూసి నాకు ఏం చేయాలో అర్థం కాలేదన్నారు.. ఇంత లగ్జరీ లైఫ్ అనుభవిస్తున్న మాల్యా గురించి మాటల్లో చెప్పలేం’ అంటూ జేమ్స్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇటీవలే ముంబైలోని ఓ సమావేశంలో పాల్గొన్న జేమ్స్... మాల్యా లండన్ లో ఏవిధంగా ఎంజాయ్ చేస్తున్నారో అర్థం చేసుకోండని వివరించారు. ఇన్ని కేసులు నమోదైనా కానీ మాల్యా తన విలాసాలను వదులకోలేదని చెప్పుకొచ్చాడు.