Begin typing your search above and press return to search.

ప‌నామాతో పెట్టుకున్నాడు: మాల్యా క‌థ కంచికే

By:  Tupaki Desk   |   16 Oct 2017 10:08 AM GMT
ప‌నామాతో పెట్టుకున్నాడు:  మాల్యా క‌థ కంచికే
X
విజ‌య్ మాల్యా.. ఈ పేరుకు పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర్లేదు. లిక్క‌ర్ డాన్ స‌హా కింగ్‌ ఫిష‌ర్ అధినేత‌గా భార‌త్‌ లోని బ్యాంకుల‌ను బురిడీ కొట్టించి దేశం నుంచే ప‌లాయ‌నం చిత్త‌గించిన మాల్యా.. ఇప్పుడు బ్రిట‌న్‌ లో త‌ల‌దాచుకుంటున్నాడు. అయితే, అక్క‌డా ఆయ‌న కొన్ని కేసుల్లో ఇరుక్కున్నాడు. ఇక‌, భార‌త్ విష‌యానికి వ‌స్తే.. వేల కోట్ల రూపాయ‌ల మేర‌కు ఆయ‌న బ్యాంకుల‌ను ముంచేశాడు. కేవ‌లం త‌న స‌ర‌దాలు - సంతోషాలు తీర్చుకోవ‌డం కోసం బ్యాంకుల ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేశాడు. ఈయ‌న‌పై కేసులు న‌మోదైనా.. బ్రిట‌న్ నుంచి తీసుకురావ‌డంపై ఇంకా ప‌నులు సాగ‌డం లేదు.

అయితే, ఇంత‌లోనే మాల్యాపై మ‌రో పీట‌ముడి ప‌డింది. ప్ర‌పంచాన్ని కుదిపేసిన ప‌నామా పేప‌ర్లలో వ‌చ్చిన వార్త‌ల నేప‌థ్యంలో త‌న ప‌ద‌విని సైతం కోల్పోయారు పాక్ ప్ర‌ధాని న‌వాజ్ ష‌రీఫ్‌. ఇప్పుడు ఇదే పేప‌ర్ల‌లో హ‌వాలా కేసుల‌కు సంబంధించి మాల్యా పేరు గ‌ట్టిగా వినిపిస్తోంది. విజయ్‌ మాల్యాకు చెందిన కింగ్‌ ఫిషర్‌ ఎయిర్‌ లైన్స్‌ - పనామా పేపర్‌ లో ఉన్న లిబేరియన్‌ కు చెందిన రెండు కంపెనీలతో లావాదేవీలు జరిపినట్టు ఇండియన్‌ ఎక్స్‌ ప్రెస్‌ రిపోర్టు చేసింది. 2,14,488పైగా విదేశీ కంపెనీల ఫైనాన్సియల్‌ - అటార్ని క్లయింట్‌ సమాచారానికి చెందిన 11.5 మిలియన్‌ లీక్‌ డ్‌ డాక్యుమెంట్లే ఈ పనామా పేపర్లు. తాజా విచారణలో భాగంగా ఓ రెండు సంస్థలు - ప్రస్తుతం పనిచేయని దేశీయ క్యారియర్‌ లో వాటాలు కలిగి ఉన్నట్టు తెలిసింది.

ఈ రెండు సంస్థలు మారిసస్‌ కు చెందిన ఐక్యూ బ్రిడ్జ్‌ లిమిటెడ్‌ - తన దేశీయ సబ్సిడరీ ఐక్యూ బ్రిడ్జ్‌ లిమిటెడ్‌ - బెంగళూరు అని తెలిసింది. వీటిని విజయ్‌ మాల్యా - యూబీ గ్రూప్‌ తన ఆధీనంలో నడిపించేదని తేలింది. కింగ్‌ ఫిషర్‌ ఎయిర్‌ లైన్స్‌ - డెక్కన్‌ ఏవియేషన్‌ లో విలీనం కాకముందు ఈ రెండు సంస్థలు 15 లక్షలు - 52 లక్షల ఈక్విటీ షేర్లను కలిగి ఉన్నట్టు రిపోర్టు పేర్కొంది. 2007-08 కాలంలో ఐక్యూ బ్రిడ్జ్‌ మారిసస్‌ లో ఉన్న 99 షేర్లలో మాల్యా 89ని లిబేరియా రిజిస్ట్రేషన్‌ కలిగి లోమ్‌ బార్డ్‌ వాల్ కార్పొరేట్ సర్వీసెస్ ఇంక్‌ కు ట్రాన్సఫర్‌ చేసినట్టు సీఎఫ్‌ ఐఓ నివేదికలో తెలిసిందని ఇండియన్స్‌ ఎక్స్‌ ప్రెస్‌ పేర్కొంది. అంతేకాక యూనైటెడ్‌ బెవరీస్‌ హోల్డింగ్‌ లిమిటెడ్‌ కు చెందిన ఓవర్‌ సీస్‌ సబ్సిడరీ యూబీ ఓవర్‌ సీస్‌ లిమిటెడ్‌ - కింగ్‌ ఫిషర్‌ కు చెందిన 1.67 కోట్ల షేర్లను కొనుగోలుచేసినట్టు కూడా విచారణ నివేదికలు పేర్కొన్నాయి. వీటి విలువ రూ.50.02 కోట్లు. దీంతో మాల్యాపై మ‌రో కేసు న‌మోద‌య్యే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు నిపుణులు. ఇప్పుడు ఎలా త‌ప్పించుకుంటారో చూడాలి.