సౌండ్ లేదు.. మంచి రోజు కాదు!

Fri Oct 11 2019 07:00:01 GMT+0530 (IST)

విజయ్ దేవరకొండ 'మీకు మాత్రమే చెప్తా' సినిమాతో నిర్మాతగా మారిన సంగతి తెలిసిందే. 'పెళ్ళిచూపులు' చిత్రంతో తనకు సోలో హీరోగా ఫస్ట్ హిట్ అందించిన దర్శకుడు తరుణ్ భాస్కర్ ను ఈ సినిమాతో హీరోగా పరిచయం చేస్తున్నాడు. నూతన దర్శకుడు షమీర్ సుల్తాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 1 న రిలీజ్ కానుంది.విజయ్ దేవరకొండ ఏ సినిమాలో నటించినా ఆ సినిమాలకు వినూత్న రీతిలో ప్రచారం చేపడతాడు. తన సినిమాలకు నిర్మాత ఎవరైనా ప్రమోషన్స్ లో మాత్రం విజయ్ దేవరకొండ మార్క్ తప్పనిసరిగా కనిపిస్తుంది.  అయితే 'మీకు మాత్రమే చెప్తా' విషయంలో ఆ జోష్ కనిపించడం లేదు. సినిమా విడుదలకు ఇరవై రోజులే ఉన్నా ఇంకా ప్రమోషన్స్ స్లోగా ఉన్నాయి. ఇదొక్కటే అనుకుంటే ఈ సినిమాకు రిలీజ్ డేట్ మంచిరోజు కాదని కూడా ఒక టాక్ ఉంది. ప్రమోషన్స్ స్లోగా ఉండడం.. అన్ సీజన్ అయిన నవంబర్ లో రిలీజ్ చేయడం.. పైగా మంచి డేట్ కాకాకపోవడం చూస్తుంటే సినిమాకు నెగెటివిటీ ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది. మరి రిలీజ్ లోపు ఏం చేస్తారో వేచి చూడాలి.

ఈ సినిమాలో తరుణ్ భాస్కర్ తో పాటుగా అనసూయ భరద్వాజ్.. నవీన్ జార్జ్ థామస్.. వాణి భోజన్.. పావని గంగిరెడ్డి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  శివకుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.