Begin typing your search above and press return to search.

ఈ వైరల్ వీడియో చూస్తే.. షేర్ చేయకుండా ఉండలేరంతే

By:  Tupaki Desk   |   24 Aug 2019 4:24 AM GMT
ఈ వైరల్ వీడియో చూస్తే.. షేర్ చేయకుండా ఉండలేరంతే
X
నిత్యం పదుల సంఖ్యలో వైరల్ వీడియోలు వచ్చేస్తున్న కాలమిది. అలా ఒకటి వచ్చినంతనే పాతదైపోవటం.. అంతకు మించి అన్నట్లుగా మరొకటి రావటం ఎక్కువైంది. ఇలాంటి వేళలోనూ కొన్ని వీడియోలు మనల్ని వెంటాడుతాయి. మరింత మందికి షేర్ చేయకుండా ఉండనీయవు. ఇప్పుడు చెప్పే వైరల్ వీడియో కూడా ఆ కోవకు చెందిందే.

అసలు.. ఇలా సాధ్యమా? అన్న సందేహంతో పాటు.. ఎన్ని రోజులు ఫ్యాంట్ ను విడవకుండా అలా ఉండిపోయాడన్న భావన కలగటం ఖాయం. కదలే వ్యక్తి వెనుక భాగంలో.. అది కూడా అసాధారణ ప్లేస్ లో అలా తేనెతుట్టె సాధ్యమా? అన్న సవాలచ్చ సందేహాలు ఈ వీడియో చూసినంతనే కలుగక మానవు. సోషల్ మీడియాలో తెగ షేర్ కావటమే కాదు.. చూసినంతనే నాలుగైదు సార్లు చూడకుండా ఉండలేని పరిస్థితితో పాటు.. చూసినంతనే అదే పనిగా నవ్వుకునేలా చేస్తున్న ఈ వైరల్ వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పక తప్పదు.

నాగాలాండ్ కు చెందిన పాతికేళ్ల కుర్రాడు అవాలే వేసుకున్న జీన్స్ ఫ్యాంటు వెనుక భాగంలో తేనెతుట్టె పెట్టేసింది. అయినప్పటికీ.. ఆ కుర్రాడు మాత్రం దానికి భయపడకుండా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇతడి ధైర్యం ఇలా ఉంటే.. ఇతడి గాళ్ ఫ్రెండ్ వెలసాలూ నీనూ ఈ వీడియోను తీసి షేర్ చేసింది. 40 సెకన్లు ఉన్న ఈ వీడియో క్లిప్ లో డెనిమ్ జీన్స్ వేసుకున్న కుర్రాడి వెనుకవైపు తేనెటీగలు గూడుకట్టేశాయి. ఎన్ని రోజులు ఫ్యాంట్ వేసుకొని తీయలేదో.. ఏ రాణి తేనెటీగకు ఎందుకు కనెక్ట్ అయ్యిందో కానీ.. ఒక గుబురు తేనెతుట్టె ఇప్పుడు అతడి బ్యాక్ ప్లేస్ లో గూడు కట్టేసింది.

నాగాలాండ్ లో వైరల్ అవుతున్న ఈ వీడియోను తొలుత అక్కడి ఎమ్మెల్యే మహోన్లుమో కికోన్ పోస్ట్ చేశారు. దీన్ని చూసిన కేంద్ర క్రీడా శాఖామంత్రి కిరణ్ రిజిజూ తన ఖాతాలో పోస్ట్ చేశారు. దీంతో.. భారీ ప్రచారంతోపాటు.. పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. అసాధారణ ప్రదేశంలో తేనె తుట్టె అంటూ నాగాలాండ్ ఎమ్మెల్యే వ్యాఖ్య ఈ వైరల్ వీడియోకు అచ్చుగుద్దినట్లుగా సరిపోతుందని చెప్పాలి.