Begin typing your search above and press return to search.

నాలుగో సీటు కోసం టీడీపీ న‌యా ప్లాన్ ..!

By:  Tupaki Desk   |   24 May 2016 6:48 AM GMT
నాలుగో సీటు కోసం టీడీపీ న‌యా ప్లాన్ ..!
X
పార్టీ నుంచి పెట్టేబేడా స‌ద్దుకుని వెళిపోయే నాయ‌కులు కొంద‌రు.. పార్టీలోనే ఉంటూ అధికార ప‌క్షానికి మ‌ద్ద‌తు తెలిపే వారు మ‌రికొంద‌రు.. అధికార టీడీపీలోకి ఎప్పుడెప్పుడు వెళిపోదామా? అని చూస్తున్న నాయ‌కులు ఇంకొంద‌రు! ప్ర‌స్తుతం వైకాపాలోని నాయ‌కుల ప‌రిస్థితి. ఇవన్నీ తెలిసిన జ‌గ‌న్‌.. `పైన దేవుడున్నాడు.. కింద ప్ర‌జ‌లున్నారు. అంద‌రూ అన్నీ గ‌మ‌నిస్తున్నారు` అని చెప్పుకుంటూ కాలం గ‌డిపేస్తున్నారు. ఇదే స‌మ‌యంలో రాజ్య‌స‌భ ఎన్నికల నోటిఫికేష‌న్ విడుద‌లైంది. త‌మ‌కు ద‌క్కే ఒక్క సీటులో ఎవ‌రిని పంపాలా? అని ఒక ప‌క్క చ‌ర్చ‌జ‌రుగుతోంది. మ‌రోప‌క్క‌.. ఆ ఒక్క‌సీటును వైకాపాకి ద‌క్క‌కుండా తామే చేజిక్కించుకోవాల‌ని టీడీపీ ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తోంది. అంతేకాదు మొన్న‌టివ‌ర‌కూ జ‌గ‌న్‌ కు రైట్‌ హ్యాండ్‌ లా ఉన్న వ్య‌క్తి.. దీనికి పెద్ద ప‌థ‌క‌మే వేశారట‌. ఇంత‌కీ ఏంటా ప‌థ‌కం.. ఎవ‌రా వ్య‌క్తి?

నెల్లూరు జిల్లాలో జ‌గ‌న్‌ కు అత్యంత స‌న్నిహితుడిగా పేరొందిన వేమిరెడ్డి ప్రభాక‌ర రెడ్డి.. ఇటీవ‌లే టీడీపీలో చేరిపోయారు. అయితే ఆయ‌న‌కు రాజ్య‌స‌భ ఎంపీగా వెళ్లాల‌ని కోరిక‌గా ఉంద‌ని సీఎం చంద్ర‌బాబు చెప్పార‌ట‌. అయితే టీడీపీ త‌ర‌ఫున ఖాళీ అయ్యే మూడు సీట్ల‌లో పోటీ చేయ‌న‌ని, ఆ నాలుగో సీటుకు కూడా పోటీ చేద్దామ‌ని వివ‌రించార‌ని స‌మాచారం. త‌న‌కు వైకాపాలో ప‌రిచయాలు బాగా ఉన్నాయ‌ని.. తాను నిల‌బ‌డితే వైకాపా ఎమ్మెల్యేలు మ‌ద్ద‌తు ఇవ్వ‌డం ఖాయ‌మ‌ని.. ఎలాగైనా త‌న‌కు ఆ నాలుగో సీటు త‌న‌కు కేటాయించాల‌ని కోరార‌ట‌.

టీడీపీ అభ్య‌ర్థిగా నిలిచి.. వైకాపా ఎమ్మెల్యేల మ‌ద్దతుతో గెల‌వ‌గ‌ల‌న‌ని ధీమా వ్య‌క్తంచేశార‌ట‌. త‌న‌కు బాగా స‌న్నిహితులైన త‌న సామాజిక‌వ‌ర్గానికి చెందిన ఎమ్మెల్యేల ఓట్లు తాను వేయించుకుంటాన‌ని కూడా ఆయ‌న బాబుకు చెప్పార‌ట‌. ఈ ప్ర‌తిపాదన‌కు చంద్ర‌బాబు సానుకూలంగానే స్పందిచార‌ని స‌మాచారం. ఈ విష‌యంపై ఇప్ప‌టికే పార్టీ జాతీయ ప్ర‌దాన కార్య‌ద‌ర్శి లోకేష్‌ తో కూడా వేమిరెడ్డి చ‌ర్చించార‌ట‌. అక్క‌డి నుంచి కూడా ఆయ‌న‌కు గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చేసింద‌ని స‌మాచారం. మ‌రి వైకాపాని రాజ‌కీయంగా దెబ్బ‌కొట్టేందుకు... రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో క్లీన్ స్వీప్ చేసేందుకు చంద్ర‌బాబు - వేమిరెడ్డి వేసిన ఈ న‌యా ప్లాన్ ఎంత వ‌ర‌కూ ఫ‌లిస్తుందో వేచిచూడాలి!