Begin typing your search above and press return to search.

ఏపీలో షురూ; షోరూంలోనే వెహికిల్ రిజిస్ట్రేషన్

By:  Tupaki Desk   |   26 July 2016 7:59 AM GMT
ఏపీలో షురూ; షోరూంలోనే వెహికిల్ రిజిస్ట్రేషన్
X
అందుబాటులోకి వస్తున్న సాంకేతికతను అందిపుచ్చుకుంటూ పాలనా పరమైన విధానాల్లో సమూలంగా మార్పులు తీసుకురావటమే కాదు.. అవినీతికి చెక్ పెట్టటంతో పాటు.. సమయాన్ని ఆదా చేసే ప్రయత్నాలపై ప్రభుత్వాలు దృష్టి పెడుతున్నాయి. ఇందులో భాగంగా తాజాగా ఏపీలో వాహన రిజిస్ట్రేషన్ విషయంలో సమూల మార్పులు తీసుకురావటమే కాదు.. సరికొత్త విధానాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఇప్పటివరకూ కొత్త వాహనం కొంటే.. ఆ వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేసేందుకు ఆర్టీవో ఆఫీసుకు వెళ్లటం.. అక్కడ గంటల కొద్దీ వెయిట్ చేయటం.. పనిలోపనిగా అక్కడి బ్రోకర్లకు డబ్బులు సమర్పించుకోవటం లాంటివి తెలిసినవే. ఇప్పటివరకూ ఈ విధానాన్ని ప్రక్షాళన చేసేందుకు పెద్దగా ప్రయత్నించింది లేదు. తాజాగా ఏపీ సర్కారు పాత విధానానికి చెక్ పెడుతూ.. కొత్త విధానాన్ని ఈ రోజు నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో.. వాహనాన్ని కొనుగోలు చేసిన షోరూమ్ లోనే రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో.. పర్మినెంట్ నెంబరు కోసం ఎక్కువకాలం వెయిట్ చేయకుండా ఒక్కరోజులోనే లభించే వీలు కలుగుతుంది. అంతేకాదు.. హైసెక్యూరిటీ నెంబరు ప్లేట్ ను కేటాయించటం కూడా నాలుగు రోజుల వ్యవధిలో వచ్చే ఏర్పాటు చేశారు.

తాజాగా అందుబాటులోకి వచ్చిన విధానంతో వాహనం కొన్నాక ఆర్టీవో ఆపీసు చుట్టూ తిరిగే పని తగ్గిపోవటంతో పాటు.. అవినీతికి కూడా అస్కారం ఉండనే చెప్పాలి. బండి కొనుగోలు ఎంత ఈజీనో.. అంతే తేలిగ్గా వెహికిల్ రిజిస్ట్రేషన్ కార్యక్రమం కూడా పూర్తి అవుతుందని చెప్పొచ్చు.