వైసీపీలోకి బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే

Fri May 19 2017 11:17:47 GMT+0530 (IST)

బొబ్బిలి నుంచి ఎమ్మెల్యేగా పలు మార్లు గెలిచి ఆ తరువాత ఎమ్మెల్సీగానూ పనిచేసిన సీనియర్ లీడర్ వాసిరెడ్డి వరద రామారావు వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరబోతున్నారు. ఆయన రెండు నెలల కిందటే టీడీపీని వీడారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న జగన్ ను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారంటూ సొంత పార్టీ టీడీపీపై నిప్పులు చెరిగి ఆ పార్టీ నుంచి నిష్క్రమించారు. అప్పటి నుంచి ఆయన పార్టీకి దూరమయ్యారు. తాజాగా ఆయన వైసీపీలో చేరనున్నట్లు ప్రకటించారు.
    
ఈ రోజు శ్రీకాకుళం జిల్లా రణస్థలం వద్ద పార్టీ అధ్యక్షుడు జగన్ సమక్షంలో వాసిరెడ్డి వైసీపీ తీర్థం పుచ్చుకుటారు.  జగన్ నేటి నుంచి రెండు రోజుల పాటు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఆయన శ్రీకాకుళం జిల్లాలో అడుగుపెట్టిన కొద్దిసేపట్లోనే వాసిరెడ్డి చేరిక ఉండనుంది.
    
కాగా శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం నియోజకవర్గ పరిధిలోని హిరమండలంలో వంశధార నిర్వాసితులతో జగన్ ఈ రోజు భేటీ అవుతారు. మరుసటి రోజు అంటే శనివారం ఇచ్ఛాపురం నియోజకవర్గంలోని జగతి గ్రామంలో కిడ్నీ వ్యాధి గ్రస్తులను కలుసుకుంటారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/