Begin typing your search above and press return to search.

నాన్న‌ను చంపిన టీడీపీలో చేరుతానా...

By:  Tupaki Desk   |   17 Jan 2018 8:22 AM GMT
నాన్న‌ను చంపిన టీడీపీలో చేరుతానా...
X
`వైసీపీకి మరో షాక్...ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్న వంగవీటి రాధా. ఈ నెల 22న టీడీపీలో చేరనున్న వంగ‌వీటి రంగ త‌న‌యుడు` అంటూ ఓ వ‌ర్గం మీడియా - సోష‌ల్ మీడియా వేదిక‌గా కొంద‌రు చేస్తున్న ప్ర‌చారానికి చెక్ ప‌డింది. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ విజయవాడ సెంట్రల్ సీట్ హామీ ఇవ్వక పోవడంతో టీడీపీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు స‌మ‌క్షంలో వైసీపీ నేత వంగ‌వీటి రాధాకృష్ణ సైకిల్ ఎక్క‌నున్నార‌ని జోరుగా సాగిన క‌థ‌నాల‌కు స్వ‌యంగా రాధా వివ‌ర‌ణ ఇచ్చారు. `మా నాన్నని చంపిన టీడీపీలో ఏ రకంగా నేను జాయిన్ అవుతాను? నాకు టీడీపీలో జాయిన్ అవ్వాల్సినంత ఖ‌ర్మ‌ పట్టలేదు. ఇంకొక్కసారి ఇలాంటి చెత్త వార్తలు రాస్తే పరువు నష్టం దావా వేస్తా` అని వంగ‌వీటి రాధా దిమ్మ‌తిరిగే స్పంద‌న‌తో ఆ వార్త‌ల‌కు చెక్ ప‌డిందని వైసీపీ వ‌ర్గాలు అంటున్నాయి.

కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకి విజ‌య‌వాడ‌ సెంట్రల్ నియోజ‌క‌వ‌ర్గం - వెల్లంపల్లి శ్రీ‌నివాస్‌ కు తూర్పు - యలమంచిలి రవిని పార్టీలోకి తెచ్చి పశ్చిమ టికెట్స్ ఇవ్వాలని జగన్ నిర్ణయం తీసుకున్నార‌ని....వంగవీటి రాధాను అవనిగడ్డ నియోజ‌క‌వ‌ర్గం వెళ్లాలని జగన్ నిర్ణయం తీసుకున్నార‌ని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రిగింది. 2019లో వైసీపీ అధికారంలోకి రాదని త‌న అనుచరులతో వంగ‌వీటి రాధా చెప్పార‌ని... ముఖ్యమంత్రి హామీతో టీడీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నార‌ని కూడా క‌థ‌నాలు వ‌చ్చియి. ఈ నేప‌త్యంలో ఓ టీవీ ఛాన‌ల్‌ తో మాట్లాడుతూ వంగ‌వీటి రాధా క్లారిటీ ఇచ్చారు.

తాను పార్టీ మారుతున్న‌ట్లు జ‌రుగుతున్న ప్ర‌చారం పూర్తిగా అవాస్త‌వ‌మ‌ని కొట్టిపారేశారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్‌ జగన్ మోహ‌న్ రెడ్డి త‌న సోదరుడని స్ప‌ష్టం చేశారు. త‌న ప్రాణం ఉన్నంత వరకు వైసీపీలోనే ఉంటాన‌ని తేల్చిచెప్పారు. 2019లో బెజవాడ సెంట్రల్ నియోజకవర్గం నుండి గెలిచి కృష్ణాజిల్లాలో మిగిలిన సీట్లను సైతం గెలిపించే అందుకు త‌న సర్వశక్తులు ఒడ్డుతాన‌ని వంగవీటి రాధా ప్ర‌క‌టించారు. ఇలాంటి వార్త‌లు రాస్తే..ప‌రువు న‌ష్టం దావా వేస్తానని రాధా తేల్చిచెప్పారు.