Begin typing your search above and press return to search.

రాధా క్లారిటీ మిస్‌!... మీడియాపై మిస్ ఫైర్‌!

By:  Tupaki Desk   |   24 Jan 2019 8:12 AM GMT
రాధా క్లారిటీ మిస్‌!... మీడియాపై మిస్ ఫైర్‌!
X
వంగ‌వీటి రాధాకృష్ణ వ్య‌వ‌హారం నిజంగానే ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారిపోయింది. ఇటీవ‌లే వైసీపీకి రాజీనామా చేసిన రాధా... త్వ‌ర‌లోనే టీడీపీలో చేరిపోతార‌ని, ఇందుకు ఈ నెల 25న ముహూర్తం కూడా నిర్ణ‌యించుకున్నార‌ని ఇప్ప‌టికే వార్త‌లు వ‌చ్చాయి. ఈ మేర‌కు రాధాతో టీడీపీ నేత‌లు క‌లిసి చ‌ర్చించిన వీడియోలు, ఫొటోలు కూడా బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అయితే త‌న భ‌విష్య‌త్తు కార్యాచ‌ర‌ణ‌పై క్లారిటీ ఇచ్చేందుకు కాసేప‌టి క్రితం మీడియా ముందుకు వ‌చ్చిన రాధా... ఆ క్లారిటీ ఇవ్వ‌క‌పోగా... క్లారిటీ కోసం య‌త్నించిన మీడియాపై ఆయ‌న మిస్ ఫైర‌య్యారు. జ‌ర్న‌లిస్టుల‌ను బెదిరిస్తూ, ఓ మోస్త‌రు దుర్భాష‌లాడుతూ త‌న‌దైన శైలి నిజ నైజాన్ని బ‌య‌ట‌పెట్టుకున్నారు. అర‌గంట‌కు పైగా జ‌రిగిన మీడియా స‌మావేశంలో సాంతం వైసీపీ అదినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి త‌న‌ను అవ‌మాన‌ప‌రిచార‌ని ఏక‌రువు పెట్టిన రాధా... త‌న భ‌విష్య‌త్తుపై మాత్రం సింగిల్ మాట కూడా చెప్ప‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

టీడీపీలో చేరుతున్నార‌ని వార్త‌లొస్తున్నాయి క‌దా... టీడీపీలో చేరితో మీ నాన్న గారి ఆశ‌యాలు నెర‌వేరుతాయా? అని ప్ర‌శ్నించిన ఓ మీడియా ప్ర‌తినిధిపై రాధా అంతెత్తున ఎగిరారు. స‌ద‌రు మీడియా ప్ర‌తినిధికి వేలు చూపించి మ‌రీ బెదిరించిన రాధా... ఆ త‌ర్వాత కాస్తంత త‌గ్గిన‌ట్టుగా క‌నిపించినా... మీడియా చానెళ్ల టీఆర్పీల‌పై త‌న‌దైన శైలి కామెంట్లు చేశారు. తాను చెప్ప‌ని విష‌యాన్ని మీరెలా అడుగుతారు? ఎలా ప్ర‌చారం చేస్తారు? టీఆర్పీల కోసం మీరు ఏమైనా చేస్తారులే అంటూ స‌ద‌రు మీడియా ప్ర‌తినిధిపై రాధా చిందులేశారు. మ‌రో సంద‌ర్భంలో మిమ్మ‌ల్ని ఆహ్వానించ‌డం ద్వారా రాష్ట్రంలోని మొత్తం కాపు సామాజిక వ‌ర్గం ఓట్ల‌ను టీడీపీ ఓన్ చేసుకుంటోంద‌న్న మాట‌పై వివ‌ర‌ణ కోర‌గా... రాధా మ‌రింత‌గా ఫైర్ అయిపోయారు. ప్ర‌శ్న అడిగిన మీడియా ప్ర‌తినిధితో పాటుగా ప్ర‌శ్నిస్తే... బెదిరించ‌డ‌మేమిట‌న్న లేడీ జ‌ర్న‌లిస్టుపైనా రాధా ఆగ్ర‌హంవో ఊగిపోయారు. త‌న వెనుక ఉన్న‌వాంతా కాపులేనా అని ఎదురు ప్ర‌శ్నించిన రాధా... కాపులు, రంగా అభిమానులు అన్ని పార్టీల్లో ఉన్నార‌న్న స‌త్యాన్ని గుర్తించాల‌ని గ‌ద్దించారు.

లెట్ మీ ఫినిష్ అంటూ సినిమాల్లో ఓ టాప్ మోస్ట్ విల‌న్ మాదిరిగా రాధా వ్య‌వ‌హారం ఉంద‌న్న వాద‌న వినిపించింది. అస‌లు రాధా ప్రెస్ మీట్‌ కు రావ‌డం ఎందుకు? అయ‌న చేత బెదిరింపులు, గ‌ద్దింపులు, వార్నింగులు ఇప్పించుకోవ‌డ‌మెందుకు? అంటూ జ‌ర్న‌లిస్టులు త‌మ‌లో తాము చ‌ర్చించుకోవ‌డం కూడా క‌నిపించింది. ఇంత జ‌రిగినా... వైసీపీకి రాజీనామా చేసిన విష‌యాన్ని మాత్ర‌మే ప‌దే ప‌దే చెప్పిన రాధా... తాను ఏ పార్టీలో చేరుతున్నాన‌న్న విష‌యాన్ని మాత్రం మాట మాత్రంగానైనా ప్ర‌స్తావించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. అంతేకాకుండా ఇదే అంశంపై రాధా నుంచి క్లారిటీ చెప్పిద్దామ‌ని య‌త్నించిన మీడియా ప్ర‌తినిధులకు లైవ్ గానే వార్నింగులు, బెదిరింపులు ఎదురు కావ‌డం కొస‌మెరుపు.