Begin typing your search above and press return to search.

వల్లభనేని వంశీకి లైడిటెక్టర్ టెస్ట్!

By:  Tupaki Desk   |   24 Oct 2016 4:05 AM GMT
వల్లభనేని వంశీకి లైడిటెక్టర్ టెస్ట్!
X
సాదారణంగా పెద్ద పెద్ద నేరాల్లో నిందితులైనవారికి, తీవ్రవాదుల నుంచి దేశానికి ఎదురుకాబోతున్న సమస్యల గురించి నిజా నిజాలు తెలుసుకునే క్రమంలో కోర్టు అనుమతితో, వైద్యుల పర్యవేక్షణలో లైడిటెక్టర్ పరీక్ష జరుగుతుంది! అయితే ఒక ప్రముఖ టీవీ ఛానల్ మాత్రం తెలుగుదేశం పార్టీ నేత వల్లభనేని వంశీకి మొబైల్ యాప్ సాయంతో లైడిటెక్టర్ పరీక్ష జరిపింది. వినడానికి కాస్త అనుమానంగా, సత్యదూరంగా అనిపిస్తున్నా ఇది నిజం. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఈ లైడిటెక్టర్ పరీక్ష కోసం సందించిన నాలుగు ప్రశ్నల్లో ఒకటి వంశీ నిరాకరించగా, మిగిలిన మూడు ప్రశ్నల్లో రెండు అవాస్తవాలని, ఒకటి మాత్రం వాస్తవమని తేల్చింది ఆ లైడిటెక్టర్ యాప్.

ప్రముఖ తెలుగు టీవీ ఛానల్ నిర్వహించే ముఖాముఖి కార్యక్రమానికి సంబందించి వల్లభనేని వంశీకి సంబందించిన ఇంటర్వ్యూలో వంశీని నాలుగుప్రశ్నలు అడిగాడు సదరు జర్నలిస్ట్. వీటిలో మొదటి ప్రశ్న... "2019 ఎన్నికల్లో మీరు టీడీపీ నుంచి పోటీ చేస్తారా? వైకాపా నుంచి పోటీ చేస్తారా?". ఈ ప్రశ్నకు సమాధానం లైడిటెక్టర్ యాప్ పై వేలుపెట్టి చెప్పిన వంశీ 2019 లో తాను టీడీపీ నుంచే పోటీచేస్తానని తెలపగా, అది ఫాల్స్ అని చూపించింది. దీంతో... అది యాప్ లో లోపం అని వంశీ చెప్పారు.

ఇక రెండో ప్రశ్నగా... "మీరు ఒక చేత్తో జూనియర్ ని, మరో చేత్తో లోకేష్ ని మెయింటెన్ చేస్తూ ఉన్నారు. వీరిలో మీ మనసులో ఎవరు ఉన్నారు"? ఈ ప్రశ్నకు స్పందించిన వంశీ.. వారిరువురూ వేరు వేరు రంగాల్లో ఉన్నప్పుడు డిస్ప్యూట్ ఎలా వస్తుంది అని ప్రశ్నిస్తూనే... యాప్ పై వేలుపెట్టి, నారా లోకేషే తన మనసులో ఉన్నారని, ఆయనకే తన మద్దతని చెప్పగా... అది కూడా ఫాల్స్ అని ఫలితం వచ్చింది. దీంతో మరో సారి యాప్ లో లోపం ఉందని తేల్చేశారు వంశీ.

ఇదే క్రమంలో మూడో ప్రశ్నగా... "సూరి హత్య కేసులో మీకు సంబందం ఉందా లేదా"? అని అడగ్గా... ఆ విషయంలో తాను యాప్ పై వేలుపెట్టే అవకాశం లేదని, యాప్ తప్పు చెబుతుందని అన్నారు.

చివరిగా ప్రశ్నించిన ప్రశ్న... "నెహ్రూ తో గొడవల విషయంలో వ్యక్తిగత వైరమేమీ లేదు కేవలం పార్టీ స్టాండ్ ప్రకారమే చేశానంటారా?" అనగా... ఈ విషయంలో స్పందించిన వంశీ... మొబైల్ యాప్ పై వేలుపెట్టి "నెహ్రూతో వ్యక్తిగత వైరం లేదు, ఉండబోదు" అని చెప్పగా, ఆ మొబైల్ యాప్ అది కరక్ట్ అని, ట్రూ అని తేల్చింది. అయితే... ఈ సారి మాత్రం యాప్ ని తప్పుపట్టే ఆలోచన చేయలేదు వంశీ. ఇది నిజంగా నిజమైతే ముందు చెప్పిన రెండింటి సంగతో!! ఏది ఏమైనా... కాసేపు ఈ యాప్ ని నిజమని అనుకుంటే... కొన్ని సమస్యలకు సంబందించిన సందేహాలను నివృత్తి చేయగా... కొత్త అనుమానాలను కూడా రేకెత్తించిందని పలువురు అభిప్రాయపడుతున్నారు!

నిజానికి ప్రస్తుతం అలాంటి యాప్స్ ఏమీ అందుబాటులో లేకపోయినా... ఈ యాప్ లైడిటెక్టర్ సన్నివేశం పూర్తయిన తర్వాత... "వంశీ గారు టెన్షన్ పడకండి, ఈ యాప్ చెప్పిన సమాధానాలను అంతగా నమ్మాల్సిన పని లేదు, నిజాలేమిటో కాలమే చెబుతుంది" అని సదరు జర్నలిస్టు ముగించడం కొసమెరుపు!!



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/