Begin typing your search above and press return to search.

ప్రభుత్వ బంగ్లాలో ఆ దెయ్యాల్ని పంపించింది వీళ్లే

By:  Tupaki Desk   |   22 Feb 2018 10:03 AM GMT
ప్రభుత్వ బంగ్లాలో ఆ దెయ్యాల్ని పంపించింది వీళ్లే
X
జబ్ తక్ రహేగా సమోసా మే ఆలూ.. తబ్ తక్ రహేగా బీహార్ మే లాలూ అంటూ ( సమోసాలో ఆలూ ఉన్నంత వరకు బీహర్‌ లో లాలే ఉంటాడు) వింత‌గా ప్ర‌సంగం చేస్తాడు బీహార్ మాజీ సీఎం - ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్. ఇప్పుడు లాలూను ఫాలో అవుతున్న ఆయ‌న కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ బీహార్ సీఎం నితీష్ కుమార్ - డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీల‌పై వింత వ్యాఖ్య‌లు చేస్తూ అంద‌ర్ని ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

గ‌త ఎన్నిక‌ల్లో బీహార్ లో జేడీయూ - ఆర్జేడి - కాంగ్రెస్‌ మహాకూటమిగా పోటీచేసి విజ‌యం సాధించాయి. ఆ ఎన్నిక‌ల‌ విజ‌యంతో నితీష్ తో పాటు 28మంది మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. వారిలో లాలు ప్రసాద్ కొడుకు తేజ్ ప్ర‌తాప్ యాద‌వ్ రోడ్లు - భవనాల మంత్రిగా - అతని తమ్ముడు తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ ఆరోగ్య మంత్రి శాఖను చేపట్టారు.

అయితే గ‌త ఏడాది జులై నెల‌లో లాలూ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ఐఆర్‌ సీటీసీ హోటళ్ల టెండర్ల వ్యవహారంలో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ సీబీఐ లాలూ ప్రసాద్ యాద‌వ్ ఇళ్ల తో పాటు 12చోట్ల ఏక కాలంలో దాడులు జ‌రిపింది. ఆ దాడుల‌తో సీఎం నితీష్ కుమార్ ఇబ్బందుల్లో ప‌డ్డారు.అవినీతి ఆరోపణలు - సీబీఐ కేసుల నేపథ్యంలో డిప్యూటీ సీఎం పదవికి తేజస్వి యాదవ్‌ రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో తేజ‌స్వి యాద‌వ్‌ ను డిప్యూటీ సీఎం ప‌ద‌వి నుంచి ఎలా త‌ప్పించాల‌ని నితీష్ కుమార్ యోచించారు. ఆ సంద‌ర్భంలో జరిగిన కొన్ని నాట‌కీయ‌ప‌రిణామల మ‌ధ్య నితీష్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి - గ్రాండ్ అలయెన్స్‌ కు దూరమయ్యారు. అనంతరం బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీంతో లాలూ కుమారుల్ని మంత్రి వ‌ర్గం నుంచి తొల‌గించారు.

అప్ప‌టి నుంచి నితీష్ - లాలూ మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గుమ‌నేలా వైరం కొన‌సాగుతూ వ‌చ్చింది.

ఈ నేప‌థ్యంలో లాలూ కుమారుడు తేజ్ ప్ర‌తాప్ యాద‌వ్ నితీష్ పై విచిత్రంగా సెటైర్లు వేశారు. నితీష్ హయాంలో తేజ్ ఆరోగ్య‌శాఖ మంత్రిగా ప‌నిచేశాడు. దేశ్‌ రత్న మార్గ్‌ లో ఉన్న ఓ భ‌వ‌నాన్ని తేజ్ కు కేటాయించారు. అయితే ఆ భ‌వ‌నానికి వాస్తుదోషం ఉంద‌ని ప్ర‌చారంతో మార్పులు చేయించినా తేజ్ అక్క‌డే ఉన్నాడు. కొద్ది కాలానికి మహా కూటమి నుంచి చీలిపోయి బీజేపీతో కలిసి నితీష్ ప్రభుత్వాన్నిఏర్పాటు చేశారు. దీంతో లాలూ కూమారుల్ని మంత్రి వ‌ర్గ నుంచి తొల‌గించారు.

అనంతరం ఆ భవనాన్ని ఖాళీ చేయాలంటూ తేజ్ ప్రతాప్ యాదవ్‌ కు నితీష్ ప్రభుత్వం నోటీసులు పంపింది. కానీ, సీఎంగా ఉన్న సమయంలో తన తల్లి రబ్రీదేవి ఇదే భవనాన్ని ఉపయోగించడం - ఇది సెంటిమెంటుగా భావించి తేజ్ ఖాళీ చేయలేదు. ఆ తర్వాత ఆర్జేడీ నేతలు ప్రభుత్వ ఆదేశాలపై హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు స్టే విధించింది.

ఈ నేప‌థ్యంలో ప్రభుత్వ బంగ్లాను తేజ్ ఖాళీ చేశాడు. ఈ సంద‌ర్భంగా ఆ భవనంలోకి సీఎం నితీష్ కుమార్ - డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోడీలు దెయ్యాల్నిపంపించార‌ని - ఆ దెయ్యాల వ‌ల్ల ఖాళీ చేయాల్సి వ‌చ్చింద‌ని సంచలన వ్యాఖ్యలు చేశారు. అవి తనను పరేషాన్ చేస్తున్నాయని తెలిపారు.

ఈ వ్యాఖ్య‌ల‌పై ప్ర‌భుత్వానికి చెందిన కొంద‌రు నేత‌లు దుమ్మెత్తి పోస్తున్నారు. అత‌ని సోద‌రుడు తేజస్వి యాదవ్ ఈ మధ్య తరచూ మీడియాలో కనిపిస్తున్నాడు.. ఇప్పుడు మీడియాను తనవైపు మళ్లించుకోవడానికే తేజ్ ప్రతాప్ యాదవ్ ఈ దెయ్యాల నాట‌కాలుడుతున్నాడ‌ని జేడీయూ అభివర్ణించింది.