గెలుపు కోసం రేవంత్ రెడ్డి ఇంటికి వాస్తు మార్పులు

Wed Mar 27 2019 07:00:01 GMT+0530 (IST)

టైమ్ బాగున్నప్పుడు మనకు అన్నీ కలిసివస్తాయి. అదే టైమ్ బాగోలేనప్పుడు తాడు పట్టుకున్నా పామై కరుస్తుంది. ప్రస్తుతం అలాంటి బ్యాడ్ ఫేజ్ నే అనుభవిస్తున్నాడు రేవంత్ రెడ్డి. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తన సత్తా చాటిన  రేవంత్ రెడ్డికి నాలుగేళ్ల నుంచి అస్సలు టైమ్ కలిసిరావడం లేదు. ఓటుకు నోటు కేసు ఇంకా వెంటాడుతూనే ఉంది. అన్నింటికి మించి కొడంగల్ లో గెలిచి సత్తా హ్యాట్రిక్ కొడదామనుకున్న రేవంత్ ఆశలు ఫలించేలేదు. దీంతో. ఈసారి ఎలాగైనా సరే మల్కాజ్ గిరిలో గెలవాలని జూబ్లిహిల్స్ లోని తన ఇంటికి వాస్తు మార్పులు కూడా చేయిస్తున్నాడు రేవంత్.
   
రేవంత్ తన కొత్త ఇంట్లోకి 2013లో వచ్చాడు. ఇల్లు కూడా తన టేస్ట్ కు తగ్గట్లుగా కట్టించుకున్నాడు. అదేం విచిత్రమే మరి ఆ తర్వాత రేవంత్ కి వరుస కష్టాలు మొదలయ్యాయి. దీంతో.. కొంతమంది పండితుల్ని కలిసి సలహా అడిగాడు. దానికి వారు కొన్ని మార్పుల్ని సూచించారు.ప్రస్తుతం తన ఇంటికి వారు చెప్పిన సలహా ప్రకారం వాస్తు మార్పుల్ని చేయిస్తున్నాడు రేవంత్ రెడ్డి. రేవంత్ టార్గెట్ ఇప్పుడు మల్కాజ్ గిరే. అధిష్టానం నమ్మకంతో ఇచ్చిన అవకాశాన్ని కచ్చితంగా ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాడు. అందుకే తనకు కలిసివచ్చే ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఇప్పటికే కోదండరామ్ - చాడ వెంకటరెడ్డి లాంటి ప్రముఖుల మద్దతు తీసుకున్నాడు. ఇప్పటికే ప్రచారం కూడా మొదలుపెట్టేశాడు.