Begin typing your search above and press return to search.

కేసీఆర్‌,గాలి జ‌నార్ద‌న్ రెడ్డి ఒక్క‌టే

By:  Tupaki Desk   |   23 Feb 2017 7:55 AM GMT
కేసీఆర్‌,గాలి జ‌నార్ద‌న్ రెడ్డి ఒక్క‌టే
X
తార్నాక లో ప్రోఫెస‌ర్ కోదండరాం సార్ నివాసానికి వచ్చి కాంగ్రెస్‌ సీనియర్ నేత వీహెచ్ - విమలక్కలు ఆయ‌న‌తో స‌మావేశం అయ్యారు. ఈ సంద‌ర్భంగా ప‌లు అంశాలు చ‌ర్చించారు. తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరాంను కలిసిన అనంత‌రం విమలక్క మీడియాతో మాట్లాడుతూ...ఎవరైనా దోపిడీ చేస్తే పోలీస్ లకు చెప్తామని, మరి పోలీసులే దాడి చేస్తే ఎవరికీ చెప్పేదని వ్యాఖ్యానించారు. సొంత రాష్ట్రంలో ఉన్నామా... స‌రిహ‌ద్దు బార్డ‌ర్‌ లో ఉన్నామా అనేది అర్థం కాకుండా ఉంద‌ని అన్నారు. ఉద్యమ శక్తుల అణచివేతకే పోలీసు ఉద్యోగాల భర్తీ అని ఆరోపించారు. పోలీసులను బలోపేతం చెయ్యడంలో ఉన్న చిత్త శుద్ధి, ప్రజలకు ఇచ్చిన హామిలను అమలు చెయ్యడంలో ఎందుకు లేదని విమ‌ల‌క్క ప్ర‌శ్నించారు. ప్రజలు కోరుకున్న తెలంగాణ ఇది కాదని చెప్పారు. పోలీసుల చేత చేయించిన దాడికి ప్రభుత్వం సిగ్గుపడాలని, మరో ఉద్యమానికి అందరు సిద్దంకావాలని స్ప‌ష్టం చేశారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామి నెరవేర్చే వరకు పోరాడాలని విమ‌ల‌క్క‌ సూచించారు.

కోదండరాంతో స‌మావేశం అయిన అనంత‌రం ఆయ‌న నివాసం వద్ద వీహెచ్ మీడియాతో మాట్లాడారు. చిరకాల వాంఛ అయిన తెలంగాణ సాధన కోసం పనిచేసిన కోదండరాం గతంలో ఇచ్చిన హామీలు మాత్రమే అడిగార‌ని, 3 ఏళ్లు అయినా ఉద్యోగాలు ఇవ్వలేదని ఆయ‌న ఆవేద‌న అని తెలిపారు. ఉగ్రవాదులు, నక్సలైట్ అని ముద్ర‌వేస్తున్నారని ఆరోపించారు. గతంలో ఉద్యమం చేసినప్పుడు వాళ్ళు కూడా ఆయ‌న‌తో ఉన్నారని చెప్పారు. "ప్రొఫెస‌ర్‌ జయశంకర్ తో కోదండరాం సమానం. సకలజనుల సమ్మె - వంటా వార్పు - కుల సంఘాలు ఏకం చేశాడు. అయన ఎం తప్పు చేసాడని... అర్ధరాత్రి వచ్చి అరెస్ట్ చేస్తారు? పోలీస్ వాళ్ళే సీసీ కెమెరాలు తీసివేస్తారా?మాకు చెప్పే వాళ్ళే ఇలా చేస్తారా.? కోదండరాం ఏమైనా ఐసిస్ ఎజెంటా? మీ ప్ర‌భుత్వం ఆయ‌న్ను తీవ్ర‌వాదిలాగా చూస్తోందా? కేసీఆర్ ను ఆయ‌న‌ భజనప‌రులు తప్పుదోవ పట్టిస్తున్నారు" అని తెలిపారు."కేసీఆర్ ది ఏమైనా నిజాం సర్కారా? ఇంత పెద్ద ఇష్యూ నడిస్తే తిరుపతి పోతావ?. దానం చేసేది ఉంటే... నీ ఫార్మ్ హౌస్‌ లో పండినవి చెయ్. గాలి జనార్ధన్ రెడ్డి కూడా ఆయ‌న‌వి కాని సొమ్ములు ఖ‌ర్చు చేసిండు. ఇక్క‌డ‌ ప్రజలను లోపల తోయించి తిరుప‌తిలో ప్రజల క్షేమం అంటాడు. నిన్నటి అరెస్ట్ లు దుర్మార్గం. ఇది రాజుల కాలం కాదు. నువ్వు రాజువు కాదు" అంటూ నిప్పులు చెరిగారు. నిరుద్యోగ సమస్యపై ఇదేవిదంగా పోరాడాలని కోరిన వీహెచ్, తెలంగాణ సర్కార్ ఇచ్చిన హామీల అమలుకు పోరాటం చేయాలని సూచించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/