కాంగ్రెస్ ను భయపెడుతున్న చినబాబు

Fri Nov 09 2018 15:09:28 GMT+0530 (IST)

మహాకూటమితో మహా విజయం దక్కుతుందని ఊహిస్తున్న కాంగ్రెస్ పార్టీ చంద్రబాబును ఓ కోరిక కోరాలని డిసైడ్ అయ్యిందట. అది కాంగ్రెస్ నేతల కోరిక. ఇంతకీ అదేంటో తెలుసా... చినబాబు మాకొద్దు అని. ఇదేం కోరిక అనుకుంటున్నారా. వివరాలు తెలిస్తే... కాంగ్రెస్ నేతలు చాలా దూరదృష్టితో ఆలోచించారే అనిపిస్తుంది మీకు.లోకేష్ అమెరికాలో చదువుకున్నా తండ్రికి 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్నా ఆ రెండు కూడా లోకేష్ ప్రసంగాలకు ఉపయోగపడటం లేదు. ఇప్పటికే అనేకసార్లు నోరు జారిన లోకేష్ తెలంగాణలో కనుక ప్రచారం చేస్తే ఏం మాట్లాడతాడో అని భయపడి చస్తున్నారు కాంగ్రెస్ నేతలు. అసలే లోకేష్ సోషల్ మీడియాకు హాట్ కేకు. లోకేష్ పై సెటైర్లు సోషల్ మీడియా చాలా వేగంగా వైరల్ అయితాయి. పొరపాటున లోకేష్ నోట ఏదైనా తప్పు దొర్లితే ఇంతకాలం కష్టపడింది మొత్తం పోతుంది. పైగా కాంగ్రెస్ ప్రచారం వదిలేసి లోకేష్ చేసిన డ్యామేజ్ కంట్రోల్ చేసుకోలేక చావాలి అని కాంగ్రెస్ పెద్దల వద్ద చాలా మంది కాంగ్రెస్ నేతలు చెప్పారట. వారు కూడా ఇది నిజమే అన్నట్టు ఏకీభవించారట. ఈ విషయాన్ని చంద్రబాబుతో ప్రస్తావించి లోకేష్ ను తెలంగాణ ప్రచారానికి దూరంగా ఉండాలని ఉత్తమ్ కోరనున్నారట.

వీలైతే బాలయ్య ను కూడా ప్రచారానికి కాంగ్రెస్ నియోజకవర్గాల్లో వాడకపోవడమే మంచిదని భావిస్తోందట కాంగ్రెస్. అసలే మనమీద సీమాంధ్ర పెత్తనం అవసరమా అని టీఆర్ఎస్ ఉదృతంగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో లోకేష్ బాలయ్యల వల్ల అది మరింత ఇబ్బంది అన్నది కాంగ్రెస్ భావన.