Begin typing your search above and press return to search.

బోల్ట్ ఎంతటి రసికుడంటే..

By:  Tupaki Desk   |   1 Sep 2016 4:37 AM GMT
బోల్ట్ ఎంతటి రసికుడంటే..
X
ఇన్నాళ్లూ ఉసేన్ బోల్ట్ లోని ఒక యాంగిలే చూశారు జనాలు. ఇప్పుడు తనలోని మరో కోణాన్ని చూపిస్తున్నాడు జమైకా చిరుత. మొన్నే తన చివరి ఒలింపిక్స్ లో మెరుపులు మెరిపిస్తూ మూడు స్వర్ణాలు గెలిచిన బోల్ట్.. ఇప్పుడు రిలాక్సింగ్ మోడ్ లోకి వచ్చేశాడు. ఎప్పుడైతే రియోలో తన చివరి రేసు ముగించాడో.. ఆనాటి నుంచి తన శృంగార యాత్రను దిగ్విజయంగా కొనసాగిస్తున్నాడు. రియోలో ఓ బ్రెజిల్ మోడల్ తో శృంగారం జరిపిన బోల్ట్.. అక్కడి నుంచి లండన్ కు షిఫ్టయ్యాడు. అక్కడ ఒకరిద్దరితో కాదు.. రోజుకు ఐదుగురు.. పది మందితో అతను ఎంజాయ్ చేస్తుండటం విశేషం.

మొన్నో నైట్ క్లబ్ కు పది మంది అమ్మాయిలతో వచ్చి.. అర్ధరాత్రి దాటేవరకు ఉన్న బోల్ట్.. ఆ తర్వాత వాళ్లందరినీ తన హోటల్ గదికి తీసుకెళ్లి తెల్లవారుజాముదాకా రచ్చ రచ్చ చేసినట్లు వార్తలొచ్చాయి. తాజా వార్తల ప్రకారం అతను గత ఐదు రోజుల నుంచి అరడజను మంది అమ్మాయిలతో గడుపుతున్నాడట. ఈ సందర్భంగా అమ్మాయిలందరినీ వరుసలో నిలబెట్టి.. మీ ‘అసెట్స్’ చూపించండి అంటూ వాళ్లతో పెర్ఫామెన్స్ చేయించాడట. వాళ్లలో తనను మెప్పించిన వాళ్లకు.. ఒలింపిక్స్ సందర్భంగా తాను గెలిచిన పతకాలతో సత్కారం చేశాడట. వాళ్లను పోడియం మీద కూడా నిలబెట్టాడట. మరోవైపు బోల్ట్ రసికత గురించి అతడి మాజీ ప్రేయసి.. అమెరికా మోడల్ నైలా ఓ కొత్త విషయం చెప్పింది. ఓసారి బోల్ట్ లాంగ్ టైం గర్ల్ ఫ్రెండ్ తో పాటు తననూ కలుపుకుని ‘త్రీసమ్’ సెక్స్ చేయాలని అతను ప్రపోజల్ పెట్టినట్లు ఆమె వెల్లడించడం విశేషం. ఇన్నాళ్లూ బోల్ట్ పరుగు వేగాన్నే చూశాం కానీ.. అతడిలో ఈ కోణం గురించి ఇప్పుడిప్పుడే జనాలకు తెలిసొస్తోంది.