Begin typing your search above and press return to search.

క‌రక్కాయ మాదిరే..ప‌ల్లీనూనెతో దెబ్బేశారు

By:  Tupaki Desk   |   24 Jan 2019 4:52 AM GMT
క‌రక్కాయ మాదిరే..ప‌ల్లీనూనెతో దెబ్బేశారు
X
మోస‌పోవ‌టానికి ఏదీ అన‌ర్హం కాద‌న్న‌ట్లుగా ఉంటుందీ ఉదంతం చూస్తే. అత్యాశ‌.. త్వ‌ర‌గా డ‌బ్బు సంపాదించాల‌న్న తొంద‌రే.. మోస‌పోవ‌టానికి ద‌గ్గ‌ర మార్గాల‌న్న వైనం తాజా ఎపిసోడ్ ను చూసిన‌ప్పుడు అర్థ‌మ‌వుతుంది. ఆ మ‌ధ్య‌న క‌ర‌క్కాయలు మేం ఇస్తాం.. మీరు ఇంట్లో పొడి చేసుకొని వ‌స్తే వేల‌ల్లో డ‌బ్బులు ఇస్తామ‌న్న ఆశ చూపిన‌ప్పుడు వేలాది మంది ఎలా ఫ్లాట్ అయ్యారో తాజా ఉదంతంలోనూ ప‌ల్లీ నూనె పేరుతో అదే రీతిలో దెబ్బేశారు.

క‌ర‌క్కాయ‌ల్ని పొడి చేయ‌టానికి జ‌నంతో ఏం సంబంధం..? పొడితో భారీ లాభాలు వ‌స్తాయ‌నే అనుకుంటే.. సింఫుల్ గా పెద్ద పెద్ద యంత్రాలు పెట్టేసి ఉత్ప‌త్తి చేస్తే పోలా? ఆ చిన్న లాజిక్ మ‌న‌సుకు తడితే మోస‌పోకుండా ఉండ‌గ‌లం. కానీ.. త‌క్కువ స‌మ‌యంలో ఎక్కువ డ‌బ్బులు సంపాదించాల‌న్న అత్యాశ.. మ‌న‌సును ఆలోచించ‌కుండా చేస్తుంది.

ఈ బ‌ల‌హీన‌త‌ను గుర్తించిన మోస‌గాళ్లు.. అమాయ‌క ప్ర‌జ‌ల్ని ఆటాడుకుంటున్నారు. క‌ర‌క్కాయ పొడి మాదిరే.. ప‌ల్లీ నూనెను త‌మ‌కు తెచ్చిస్తే.. స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే భారీగా సంపాదించొచ్చ‌న్న ఆశ‌ల వ‌ల విసిరారు. దానికి ఏకంగా ఆరు వేల మంది వ‌ర‌కూ చిక్కుకొని విల‌విల‌లాడిపోతున్నారు. తాజాగా వెలుగు చూసిన ఈ మోసం గురించి వింటే నోట మాట రాదంతే. జ‌నాలు ఎంత అమాయ‌కులు అన్న సందేహం రాక మాన‌దు.

ప్ర‌తి నెల రూ.5వేలు చెల్లించండి.. 24 నెల‌ల్లో ఏకంగా రూ.20 ల‌క్ష‌లు మీ సొంతం. ఒక‌వేళ మ‌రో ల‌క్ష కానీ అద‌నంగా డిపాజిట్ చేస్తే.. ప‌ల్లీ యంత్రం ఇస్తాం.. మీరు చేయాల్సింద‌ల్లా ప‌ల్లీ గింజ‌ల నుంచి నూనె తీసి మాకివ్వాలి. ఇంత సింఫుల్ గా ల‌క్ష‌ల చొప్పున ఇస్తామంటే ఎవ‌రు మాత్రం మాయ‌లో ప‌డ‌రు. అలా ప‌డిన వేలాది మంది కోట్లాది రూపాయిల్ని చెల్లించారు.

ప‌ల్లీ మాయ చేసిన కంపెనీ హైద‌రాబాద్ లోని ఉప్ప‌ల్ లో చోటు చేసుకుంది. గ్రీన్ గోల్డ్ బ‌యోటెక్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ సంస్థ ఉప్ప‌ల్ పోలీస్ స్టేష‌న్ కు కూత‌వేటులో ఉంది. మాయ‌మాట‌లు చెప్పి జ‌నాల్ని బోల్తా కొట్టించిన ఈ సంస్థ పుణ్య‌మా అని రెండు తెలుగు రాష్ట్రాల‌కు చెందిన వారు మాత్ర‌మే కాదు.. మ‌హారాష్ట్ర.. క‌ర్ణాట‌క రాష్ట్రాల‌కు చెందిన బాధితులు ఉండ‌టం గ‌మ‌నార్హం. ఏది ఉచితంగా రాదు.. అందులోకి డ‌బ్బుల విష‌యంలో మ‌రీనూ అన్న చిన్న పాయింట్ ను గుర్తిస్తే.. ఇలాంటి మోసాల బారిన ప‌డ‌కుండా ఉండొచ్చు. మాయ మాట‌లు చెప్పే వారు చుట్టూ ఉంటారు. అప్ర‌మ‌త్తంగా ఉండాల్సిన బాధ్య‌త అంద‌రిది. అందులో ఏమాత్రం తేడా కొట్టినా.. జేబులు ఖాళీ ఖాయం.