పొలిటికల్ స్క్రీన్ పైకి కన్నడ స్టార్ ఉపేంద్ర

Sat Aug 12 2017 22:31:28 GMT+0530 (IST)

కన్నడ క్రేజీ స్టార్ ఉపేంద్ర పవన్ కళ్యాణ్ స్టైల్లో పొలిటికల్ డెసిషన్ తీసుకున్నారు. కొద్దికాలంగా ఆయన బీజేపీలో చేరుతారన్న ప్రచారం సాగుతున్న నేపథ్యంలో ఈ రోజు ఆయన క్లారిటీ ఇచ్చారు. ప్రజాకరణ అనే రాజకీయ వేదికను ఒకటి ఏర్పాటు చేశారు.. ప్రజలకు మంచి చేసే పార్టీలతో కలిసి పని చెయ్యడానికి తాను సిద్దంగా ఉన్నాని ప్రకటించారు. అయితే.... బీజేపీ ఆయన్ను దగ్గరుకు తీసుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
    
ఉపేంద్ర తన రాజకీయ వేదిక ప్రకటన సమయంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజా ప్రభుత్వంలో ప్రజలే ప్రభువులు అని.. కానీ... రాజకీయ పార్టీలు వారిని పట్టించుకోకుండా రాజకీయం చేయడంతోనే సరిపెడుతున్నాయని చురకలంటించారు. రాజకీయం అనే పదం ప్రజాప్రభుత్వానికి సరిపోవడం లేదంటూ లోతైన వ్యాఖ్యలు చేశారు. తాను
రాజకీయం చెయ్యడానికి తాను సిద్దంగా లేనని... ప్రజల కోసం పని చెయ్యడానికి సిద్దమయ్యానని ప్రకటంచారు.
    
ఈ క్రమంలో ప్రజలకు మంచి చెయ్యాలనే ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరినీ తాను చేరదీస్తానని ఉపేంద్ర చెప్పారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి తాను సిద్దం అయ్యానని ఉపేంద్ర అన్నారు.   ఖాకీ చోక్కా వేసుకుని వచ్చిన ఉపేంద్ర తాను ఒక కార్మికుడినని... రాజకీయ నాయకులు వేసుకునే ఖద్దర్ తెల్లచొక్కాలు తాను వేసుకోనని ఒక కార్మికుడిగా తాను ప్రజలకు సేవ చేస్తానని అన్నారు.  కార్మికులు రైతులు పేదల వలనే ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని ఉపేంద్ర అన్నారు. అయితే ప్రభుత్వం నుంచి వారికి అందవలసిన పథకాలు అందడం లేదని ఉపేంద్ర విచారం వ్యక్తం చేశారు. సమాజంలో ఉన్న సమస్యలు పరిష్కరించే సత్తా ఉన్న వారితోనే నేను పని చేస్తానని ఉపేంద్ర అన్నారు.
    
తాను రాజకీయ పార్టీ పెట్టాలనుకోవడం లేదని.. అందుకు చాలా డబ్బు కావాలని.. అందుకు నిధులు సేకరించాలని.. ఆ తరువాత అధికారంలోకి వస్తే నిధులిచ్చిన వారు అక్రమంగా సంపాదించుకోవడానికి అవకాశమివ్వాలని అందుకే తాను రాజకీయ పార్టీ పెట్టకుండా రాజకీయ వేదిక మాత్రమే ఏర్పాటు చేస్తున్నానని చెప్పారు. అయితే... ఈ రాజకీయ వేదిక ఆయన రాజకీయ ప్రవేశానికి వేదిక తప్ప ఇంకేమీ కాదని అంతా అనుకుంటున్నారు.