Begin typing your search above and press return to search.

సుప్రీం సంక్షోభంలో ట్విస్ట్‌: వీక్ లో సొల్యూష‌న్‌?

By:  Tupaki Desk   |   16 Jan 2018 4:33 AM GMT
సుప్రీం సంక్షోభంలో ట్విస్ట్‌:  వీక్ లో సొల్యూష‌న్‌?
X
యావ‌త్ దేశాన్ని విస్మ‌యానికి గురి చేసిన సుప్రీం సంక్షోభం టీ క‌ప్పులో తుఫాను మాదిరి తేల్చేసిన మాట‌ల‌న్ని అబ‌ద్ధాల‌ని తేలిపోయాయి. వారాంతానికి ముందు సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ దీప‌క్ మిశ్రాపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌టంతో పాటు.. ఆయ‌న తీరును త‌ప్పు ప‌ట్టిన సుప్రీంకోర్టు సీనియ‌ర్ న్యాయ‌మూర్తుల వ్య‌వ‌హారం స‌ర్దుకుంటుంద‌ని.. అంతా మామూలైపోతుంద‌న్న వార్త‌లు జోరుగా వినిపించాయి.

సోమ‌వారం ఎవ‌రికి వారు వారి.. వారి ప‌నుల్లో మునిగిపోయార‌ని.. టీ క‌ప్పులో తుఫాను మాదిరి ఇష్యూ క్లోజ్ అయ్యింద‌న్న వార్త‌లు వ‌చ్చాయి. ప్రెస్ మీట్ పెట్టిన న‌లుగురు సుప‌రీం జ‌డ్జిలు ఎలాంటి త‌ప్పులు చేయ‌లేద‌ని.. వారిపై చ‌ర్య‌ల మాటేమి లేద‌ని.. అంద‌రూ క‌లిసిపోయార‌ని.. విభేదాలు లేవంటూ అటార్నీ జ‌న‌ర‌ల్ తో పాటు సుప్రీంకోర్టు బార్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు వికాస్ సింగ్ వెల్ల‌డించారు.

అయితే.. వారిద్ద‌రూ చెప్పిన‌ట్లుగా సానుకూల ప‌రిస్థితులు లేవ‌ని చెబుతున్నారు. తాను ఎలాంటి త‌ప్పు చేయ‌లేద‌న్న భావ‌న‌లో సుప్రీంకోర్టు చీఫ్ జ‌స్టిస్ ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఈ వాద‌న‌కు త‌గ్గ‌ట్లు కీల‌క కేసుల‌ను విచారించే ఐదుగురు న్యాయ‌మూర్తుల రాజ్యాంగ ధ‌ర్మాస‌నంలో న‌లుగురు రెబెల్ న్యాయ‌మూర్తుల‌కు స్థానం ల‌భించ‌క‌పోవ‌టం చూస్తే.. వివాదం స‌మిసిపోలేదు స‌రిక‌దా.. మ‌రింత ర‌గిలేలా ప‌రిణామాలు చోటు చేసుకుంటున్న‌ట్లు చెబుతున్నారు.

కేసుల విచార‌ణ‌లో సీనియ‌ర్ న్యాయ‌మూర్తుల‌ను ప‌క్క‌న పెట్టి జూనియ‌ర్ న్యాయ‌మూర్తుల‌కు కేసులు బ‌దిలీ చేస్తున్న‌ట్లుగా విలేక‌రుల స‌మావేశంలో న‌లుగురు న్యాయ‌మూర్తులు ఆరోపించిన వైనం తెలిసిందే. చీఫ్ జ‌స్టిస్ తీరుతోనే ప‌రిస్థితి చ‌క్క‌బ‌డ‌లేద‌న్న మాట వినిపిస్తోంది. తానేం త‌ప్పు చేయ‌న‌ప్పుడు.. త‌నెందుకు త‌గ్గాల‌న్న భావ‌న‌లో జ‌స్టిస్ దీప‌క్ మిశ్రా ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. సుప్రీం సంక్షోభం టీక‌ప్పుడు తుఫాను ఎంత‌మాత్రం కాద‌ని.. అల్ప‌పీడ‌నం ఇంకా కొన‌సాగుతోంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.