Begin typing your search above and press return to search.

ఒకే ఒరలో కత్తులు ఇమిడినా యుద్ధం గెలవలేదు..

By:  Tupaki Desk   |   27 May 2019 10:33 AM GMT
ఒకే ఒరలో కత్తులు ఇమిడినా యుద్ధం గెలవలేదు..
X
ఒకే ఒరలో కత్తులు ఇమడవు .. ఇమిడినా యుద్ధం గెలవడం కష్టమని తాజా ఎన్నికలు నిరూపించాయని మాజీ ఎంపీ ఉండవల్లి వ్యాఖ్యానించారు. 1946 పరిస్థితే రిపీట్ అయ్యిందని దాదాపు 73 ఏళ్ల తర్వాత ఈసారి ఎన్నికల్లో అదే జరిగిందని ఉండవల్లి చెప్పారు.. 1946లో రాష్ట్రంలో రాజులందరూ ఓడిపోయారు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచిందని సేమ్ సీన్ ఇప్పుడు రిపీట్ అయ్యిందని.. ఈ సారి ఎన్నికల్లో పోటీ చేసిన రాజులందరూ ఓడిపోయారని చెప్పారు.. ఉత్తరాంధ్ర రాజకీయాల్లో రాజులదే హవా అని.... కురుపాం రాజు కిశోర్ చంద్రదేవ్ - విజయనగరం రాజు అశోక్ గజపతి రాజు - చినమేరంగి రాజు శత్రుచర్ల విజయరామరాజులకు ఓటమి తప్పలేదని... ఉండవల్లి వ్యాఖ్యానించారు.. అయితే ఎమ్మెల్సీగా ఉన్న మాజీ మంత్రి శత్రుచర్ల సతీమణి ఈ సారి కురుపాం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు.. అంటే ఆ మూడు రాజ కుటుంబాలు యుద్దం గెలవలేకపోయాయని ఉండవల్లి అన్నారు.. ఈ సారి ఎన్నికల్లో జరిగిన విచిత్రాల్లో ఇది ఒకటని వ్యాఖ్యానించారు.

తాను రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి రాష్ట్రంలో చాలా జిల్లాల్లో నేతలు ఉప్పు నిప్పులా ఉండేవారని.. అలాంటి నేతలందరూ ఈ సారి కలిసినా అందరూ ఓడిపోయారని ఉండవల్లి చెప్పుకొచ్చారు.. ఆ ఊళ్లో ఆ ఇద్దరూ కలిస్తే ఇక తిరుగులేదురా అనే నమ్మకాన్ని ప్రజలు తప్పని నిరూపించారు. బలం నాయకుల్లో లేదు.. ప్రజల్లోనే ఉందనే మంచి మెసేజ్ ఇచ్చారు. ప్రజలు చాలా తెలివైన వారని ఉండవల్లి కితాబిచ్చారు.. కర్నూలులో కేఈ కృష్ణమూర్తి - కోట్ల కుటుంబాల మధ్య రాజకీయ శత్రుత్వం ఉంది. వాళ్లని చంద్రబాబు కలిపినా లాభం జరగలేదు అటు టీడీపీ ఓడిపోయింది ఇటు వాళ్లు ఓడిపోయారు. అలాగే కడపలో ఆదినారాయణరెడ్డి - రామసుబ్బారెడ్డి వర్గాలనూ కలిపేసి ఒకరిని ఎమ్మెల్యేగా - ఒకరిని ఎంపీగా నిలబెట్టారు. వాళ్లిద్దరూ కూడా ఓడిపోయారు. వాళ్లలో ఆదినారయణ రెడ్డి అయితే మంత్రి కూడా.. అలాగే కష్ణా జిల్లాలో ముఖ్యంగా విజయవాడలో వంగవీటి రంగా - దేవినేని నెహ్రూ కుటుంబాల రాజకీయ వైరం చెప్పనక్కర్లేదు .. వాళ్లు ఈ సారి కలిసినా ఓటమి తప్పలేదని ఉండవల్లి వ్యాఖ్యానించారు.