ఎలక్షన్ 2018 - మీకు తెలియని విశేషాలు!

Thu Dec 06 2018 16:26:51 GMT+0530 (IST)

ప్రచారం ముగిసింది. ప్రలోభాలు మొదలయ్యాయి. నేతలు బిజీ.. ప్రజలు ఖాళీ. పాపం ఈ రోజు మందు కూడా లేదు. అందరికీ బోర్ కొడుతోంది. ఈ ఖాళీ టైం లో మీకు తెలంగాణ ఎన్నికల గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెబుతాం.* 1983లో తెలంగాణ ప్రభంజనం లో రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ చిత్తు చిత్తుగా ఓడిపోయింది. తెలుగుదేశం చారిత్రక విజయాన్ని నమోదు చేసుకుంది. అంత ఊపులో తెలుగుదేశం నుంచి పోటీ చేసిన ఓ యువకుడు ఓడిపోయారు. ఆయన ఎవరో తెలుసా... టీఆర్ఎస్ అధినేత కేసీఆర్. చాలామందికి తెలియని విషయం ఇది.

* రాష్ట్రానికి మొదటి పౌరుడు గవర్నర్. మరి మొదటి ఓటరు ఎవరో తెలుసా? రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో క్రమసంఖ్యను అనుసరించి మొట్టమొదటి నియోజకవర్గం కుమరం భీం జిల్లాలోని సిర్పూర్. ఈ నియోజకవర్గంలోని  కాగజ్‌నగర్ మండలం మాలిని గ్రామానికి చెందిన *కినాక సుమనాబాయి* రాష్ట్రంలో తొలి ఓటరు. ఓటరు జాబితా క్రమ సంఖ్య ప్రకారం ఆమెకు దక్కిన అనుకోని క్రెడిట్ ఇది.

* ప్రజాకవి కాళోజీ నారాయణ రావు తెలియన వారు తెలంగాణలో ఉండరు. కానీ ఆయన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన విషయం మీకు తెలుసా? 1977లో ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి నియోజకవర్గం నుంచి స్వంతంత్ర అభ్యర్థి గా పోటీ చేసి ఆయన ఓడిపోయారు. ఆయన పై గెలిచిన వ్యక్తి ఆనాటి ముఖ్యమంత్రి అభ్యర్థి జలగం వెంగళరావు.

* తెలంగాణ ఎన్నికల్లో బీజేపీ అన్ని స్థానాల నుంచి పోటీ చేస్తోంది. 119 మందిలో ఒకే ఒక ముస్లిం అభ్యర్థి ఉన్నారు. అది కూడా మహిళ. ఆమె పేరు సయ్యిద్ షెహజాదీ. ఎం ఐ ఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ పై చాంద్రాయణ గుట్ట నియోజకవర్గం నుంచి పోటీ చేస్తోంది. ఈమె ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి.  

* ఈ ఎన్నికల్లో ఒకే ఒక ట్రాన్స్‌జెండర్ పోటీ చేస్తోంది. ఆమె రెండ్రోజులు అదృశ్యం కావడంతో ఇపుడు అందరికీ తెలిసింది.  బీ ఎల్ ఎఫ్ తరఫున  ట్రాన్స్ జెంటర్ చంద్రముఖి హైదరాబాద్‌లోని గోషామహల్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచారు. తెలంగాణలో పోటీ చేస్తున్న ఏకైక ట్రాన్స్ జెండర్ ఈమే.


TAGS: