Begin typing your search above and press return to search.

హెచ్‌1బీపై భార‌త టెకీల‌కు తీపిక‌బురు

By:  Tupaki Desk   |   26 July 2017 5:22 AM GMT
హెచ్‌1బీపై భార‌త టెకీల‌కు తీపిక‌బురు
X
అమెరికా అధ్య‌క్షుడిగా ట్రంప్ బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి భార‌త టెకీల‌కు షాకుల మీద షాకులు త‌గులుతున్న సంగ‌తి తెలిసిందే. అమెరికాలో ఉపాధికి ఉద్దేశించిన హెచ్‌1బీ వీసాల విష‌యంలో ట్రంప్ స‌ర్కారు నిర్ణ‌యాలు ఒక‌ప‌ట్టాన మింగుడుప‌డ‌ని రీతిలో మార‌టం.. దీనిపై భార‌త టెకీలు తీవ్ర నిరాశ నిస్పృహ‌ల‌కు గురి కావ‌టం తెలిసిందే.

తాజాగా ఈ వేద‌న నుంచికాస్తంత ఊర‌ట క‌లిగించే నిర్ణ‌యాన్ని ట్రంప్ స‌ర్కారు తీసుకుంద‌ని చెప్పాలి. భార‌త టెకీల‌కు ఊర‌ట క‌లిగించే తాజా నిర్ణ‌యం ఏమిటంటే.. హెచ్ 1బీ వ‌ర్క్ వీసా ప్ర‌కియ‌ను అమెరికా వేగ‌వంతం చేయ‌ట‌మే.
ఉపాధికి అవ‌కాశం క‌ల్పించే హెచ్ 1బీ.. ఎల్ 1 వీసా కార్య‌క్ర‌మాలు దుర్వినియోగం అవుతూ.. అమెరిక‌న్ల‌కు న‌ష్టం చేకూరుస్తున్నాయన్న వాద‌న‌ను తెర మీద‌కు తెచ్చిన ట్రంప్‌.. రూల్స్‌ను మ‌రింత టైట్ చేయ‌టంతో ఈ వీసాల మీద అమెరికాకు వెళ్లే వారికి ఇబ్బందిక‌రంగా మారింది.

ట్రంప్ స‌ర్కారు తీరుతో ఐటీ కంపెనీలు అలెర్ట్ కావ‌టంతో భార‌త ఐటీ నిపుణుల‌పై తీవ్ర ప్ర‌భావాన్ని చూపించింది. అయితే.. హెచ్ 1 బీ వీసాలోని కొన్ని కేట‌గిరీల‌కు సంబంధించి కొన్ని రూల్స్ విష‌యంలో మిన‌హాయింపులు ఇస్తూ ట్రంప్ స‌ర్కారు తాజాగా నిర్ణ‌యం తీసుకుంది. అత్యున్న‌త స్థాయి విదేశీ నిపుణులు.. విద్య‌.. ప‌రిశోధ‌నా సంస్థ‌ల్లో ప‌ని చేసే వారు గ‌తంలో మాదిరి త్వ‌రిత‌గ‌తిన వీసా పొందే ప్రీమియం ప్ర‌క్రియ‌ను పున‌రుద్ధ‌రిస్తున్న‌ట్లు ట్రంప్ స‌ర్కారు పేర్కొంది. మొత్తంగా కాకున్నా కొంత‌లో కొంత అయినా భార‌త టెకీల‌కు ఈ ప‌రిణామం తీపి వార్త‌గా చెప్ప‌క త‌ప్ప‌దు.