Begin typing your search above and press return to search.

బిజినెస్ కోసం పెద్దన్న కక్కుర్తి?

By:  Tupaki Desk   |   14 Feb 2016 4:15 AM GMT
బిజినెస్ కోసం పెద్దన్న కక్కుర్తి?
X
ప్రపంచానికి పెద్దగా వ్యవహరించే అమెరికాకు కాసుల కక్కుర్తి ఎంతన్న విషయం తాజాగా మరోసారి నిరూపితమైంది. నాలుగు రూపాయిలు వస్తున్నాయంటే చాలు.. వెనుకాముందు చూసుకుంటూ నిర్ణయాలు తీసుకోవటం అమెరికాకే చెల్లుతుంది. అమెరికాతో స్నేహానికి ప్రధాని మోడీ కిందామీదా పడిపోవటం.. రికార్డు స్థాయిలో ఒబామాతో తరచూ భేటీ అయ్యే మోడీని చూసినోళ్లు చాలామంది.. పెద్దన్నతో ఎంత క్లోజ్ గా మూవ్ అవుతున్నారో అని తెగ ఫీలైపోతుంటారు.

కనిపించిన ప్రతిసారీ అత్మీయ ఆలింగనాలతో.. ఒబామా తనకెంత క్లోజ్ అన్నట్లుగా ప్రధాని మోడీ ప్రదర్శించే దగ్గరతనానికి.. వాస్తవానికి మధ్యనున్న తేడాను చెప్పే ఉదంతం ఒకటి తాజాగా చోటు చేసుకుంది. పైకి ఫ్రెండ్లీగా కనిపించినప్పటికీ.. తన ప్రయోజనం తప్పించి మరింకేమీ అక్కర్లేదన్న విషయాన్ని యూఎస్ మరోసారి స్పష్టం చేసింది.

భారత్ కు పక్కలో బల్లెంలా ఉండే పాక్ కు అణ్వస్త్రాల్ని మోసుకెళ్లే ఎఫ్ 16 యుద్ధ విమానాల్ని అమ్మాలన్న నిర్ణయాన్ని అమెరికా తీసుకోవటం గమనార్హం. ఎనిమిది యుద్ధ విమానాలకు సంబంధించిన ఈ డీల్ విలువ దాదాపు రూ.700 మిలియన్ డాలర్లుగా చెబుతున్నారు. పాక్ కు యుద్ధ విమానాల్ని అమ్మాలన్న అమెరికా ఆలోచనను తాము వ్యతిరేకిస్తున్నట్లుగా భారత్ వెల్లడించింది. అమెరికాకు తన అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఈ యుద్ధ విమానాల డీల్ తో పాక్ మరింత శక్తివంతంగా మారటంతో పాటు.. భారత్ వ్యతిరేక విధానాలకు ఊతమిచ్చేలా అమెరికా వైఖరి ఉండటం గమనార్హం. తనకు కాసులు వస్తే చాలు.. ప్రపంచం ఎలా పోయినా ఫర్లేదన్నట్లుగా వ్యవహరించే అమెరికా వైఖరికి నిలువెత్తు నిదర్శనంగా తాజా ఉదంతాన్ని చెప్పొచ్చు.