Begin typing your search above and press return to search.

లోకేష్‌ కు స‌మాజ్‌ వాదీ పార్టీ న‌చ్చింద‌ట‌!

By:  Tupaki Desk   |   25 Oct 2016 9:51 AM GMT
లోకేష్‌ కు స‌మాజ్‌ వాదీ పార్టీ న‌చ్చింద‌ట‌!
X
ఉత్త‌ర్ ప్రదేశ్‌ లో అధికార పార్టీ అయిన స‌మాజ్ వాదీ పార్టీలోని కుటుంబ క‌ల‌హాలు ర‌చ్చ‌కెక్కి దేశంలో అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్న సంగ‌తి తెలిసిందే. తండ్రొక వైపు - కొడుకు ఇంకొక‌వైపు అన్న‌ట్లుగా సాగుతున్న పంచాయ‌తీల్లో ప‌రువు బ‌జారున ప‌డిపోతోంది. అయితే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాత్రం స‌మాజ్ వాదీ పార్టీకి - త‌మ పార్టీకి ఉన్న ప్ర‌త్యేక‌త‌ను వివ‌రించారు.

గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు జీవీ ఆంజనేయులు అధ్యక్షతన నిర్వహించిన జిల్లా విస్తృత సమావేశానికి ముఖ్య అతిథిగా హాజ‌రైన లోకేష్ ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ దేశంలో పట్టిష్టమైన యంత్రాంగం కలిగిన పార్టీలు టీడీపీ - సమాజ్‌ వాదీ పార్టీలేనని పేర్కొన్నారు. స‌మ‌ర్థులైన నాయ‌క‌త్వం - ప‌టిష్ట‌మైన పార్టీ ఈ రెండు పార్టీల సొంతం అని విశ్లేషించారు. ఈ సంద‌ర్భంగా త‌న మంత్రి ప‌ద‌వి గురించి లోకేష్ మాట్లాడుతూ తనకు మంత్రి పదవి అవసరం లేదని, జాతీయ ప్రధాన కార్యదర్శి నిర్వహణకే సమయం చాలడం లేదని స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలో టీడీపీ సభ్యత్వ నమోదును వచ్చే నెల 1వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పార్టీ సభ్యత్వం 55 లక్షలుందని - దీన్ని ఈ ఏడాది కోటికి పెంచేందుకు లక్ష్యంగా నిర్ణయించామని లోకేష్‌ చెప్పారు. సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికీ రశీదు ఇస్తామన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై రూపొందించిన స్టిక్కర్‌ ను ప్రతి ఇంటి తలుపునకు అంటించాలని కార్యకర్తలను కోరారు. రాష్ట్ర ప్రజల కోసం సొంత మనువ‌డితో కూడా ముఖ్య‌మంత్రి చంద్రబాబు గడపలేకపోతున్నారని చెప్పారు. రాష్ట్రం ఎన్నో ఇబ్బందుల్లో ఉంటే పట్టించుకోని ప్రతిపక్షం రాజకీయ లబ్ధికోసమే విమర్శలు చేస్తోందని లోకేష్ మండిప‌డ్డారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/