Begin typing your search above and press return to search.

ఈ రెండేళ్ల పాప రికార్డ్ సృష్టించింది

By:  Tupaki Desk   |   27 April 2017 9:11 AM GMT
ఈ రెండేళ్ల పాప రికార్డ్ సృష్టించింది
X
ఈ రెండేళ్ల బుజ్జాయి ధైర్యం - అదృష్టం కూడా చూసి మ‌నం ముచ్చ‌ట ప‌డాల్సిందే. చైనాలో భారీ రోడ్డులో ఏ మాత్రం ఇబ్బంది ప‌డ‌కుండా రోడ్డు దాటుకునేందుకు వ‌చ్చిన ఓ బుజ్జాయి ఎలాంటి ప్ర‌మాదం జ‌ర‌గ‌కుండా బ‌య‌ట ప‌డిన తీరు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. చైనాలోని ఓ బిజీ రోడ్డులో రెండేళ్ళ ఓ చిన్నారి ఆ రోడ్డు మ‌ధ్య పాకుతూ వస్తోంది. బిజీ రోడ్డులో పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఉండ‌టంతో రెండు కార్లు ఆమె మీదుగా వెళ్ళాయి! అంతా షాక్ తిన్నారు. ఏమ‌యిందోన‌ని క‌ల‌వ‌ర‌ప‌డ్డారు. అయితే ఆ పాప ఆశ్చర్యంగా ప్రమాదం నుంచి బయటపడింది. స్వల్ప గాయాలు మాత్రం తగిలాయి.

చిన్నారిని వెతుక్కుంటూ వ‌చ్చిన ఆ పాప నాన‌మ్మ ఆమెను వెంట‌నే త‌న ద‌గ్గ‌రికి తీసుకొని స‌మీపంలో ఆసుపత్రికి తీసుకువెళ్ళింది. వైద్యులు ఈ చిన్నారికి పరీక్ష‌లు నిర్వ‌హించ‌గా...చిన్న గాయాలు తగిలాయని, ప్రాణాపాయం లేదని తేలింది. దీంతో ఇటు డాక్టర్లు అటు ఆ వృద్ధురాలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే వృద్దురాలు అయిన నాన‌మ్మ గ‌మ‌నించుకోక‌పోవ‌డం వ‌ల్ల ఆ చిన్నారి రోడ్డు మీద‌కు వ‌చ్చిన‌ట్లు భావిస్తున్నారు. ఈ బుజ్జాయి రోడ్డు దాట‌డం, ప్రాణాపాయం లేకుండా బ‌య‌ట‌ప‌డిన ఘ‌ట‌న ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/