Begin typing your search above and press return to search.

సింహాద్రి డైలాగు గుర్తుచేసిన కేజ్రీవాల్

By:  Tupaki Desk   |   11 April 2018 4:23 PM GMT
సింహాద్రి డైలాగు గుర్తుచేసిన కేజ్రీవాల్
X
జూనియర్ ఎన్టీఆర్ – రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ సినిమా సింహాద్రి లో ఓడైలాగు ఉంటుంది. ఎన్టీఆర్- బ్రహ్మానందంల రహస్యం తనకు తెలిసిపోయిన తర్వాత.. వేణుమాధవ్ వారిని తరచూ వేధిస్తుంటాడు. ఆ క్రమంలో భాగంగా.. బ్రహ్మానందంతో.. అరేయ్... ‘నీ గొంతు మీద నీ కాలే వేసుకొని తొక్కుకుని చచ్చిపో’ అంటూ ఆదేశిస్తాడు. ‘ నాగొంతు మీద నా కాలే వేసుకోవాలా?’ అంటూ బ్రహ్మానందం నివ్వెరపోతాడు కూడా.

ఈ సినిమా డైలాగు పాపం.. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు తెలియకపోవచ్చు. కానీ.. ఆయన ప్రస్తుతం మోడీ గురించి అదే తరహాలో సెటైర్లు వేస్తున్నారు. మోడీ చేస్తున్న ఒకరోజు నిరహార దీక్ష అనేది తనకు వ్యతిరేకంగా తానే చేస్తున్న నిరాహార దీక్షలాగా కనిపిస్తున్నది అంటూ కేజ్రీవాల్ ట్వీట్ చేయడం విశేషం. అంటే.. దాదాపుగా.. తన గొంతు మీద తానే కాలేసి తొక్కుకోవడం లాంటిదే కదా అంటూ జనం నవ్వుకుంటున్నారు.

విషయం ఏంటంటే.. పార్లమెంటు సమావేశాలు విపక్షాల ఆందోళనలతో స్తంభించిపోయాయి. విపక్షాలు అనడం కంటె.. భాజపా ప్రేరేపిత అన్నాడీఎంకే పుణ్యమా అనే.. ఇలా జరిగిందనే ఆరోపించే వారు కూడా అనేకమంది ఉన్నారు. నిజానికి పార్లమెంటు స్తంభించడానికి అన్ని విపక్షాలు కారణం అంటూ.. అందరినీ ఒకే గాటన కట్టే బదులు.. అన్నా డీఎంకే ఒక్కటే అడ్డు పడిందని అంటే సబబుగా ఉంటుంది.

అయితే వారు తన జేబులో మనుషులే గనుక.. వారిని ఉద్దేశించకుండా రాజకీయ మైలేజీ సాధించడానికి.. ఈ దీక్ష చేస్తున్నారు. అయితే కేజ్రీవాల్ వ్యాఖ్యల ప్రకారం.. పార్లమెంటు స్తంభించడానికి మూల కారకుడు మోడీనే.. అలాంటిది తనకు వ్యతిరేకంగా ఆయనే దీక్ష చేసుకుంటున్నారు.. అని ఆయన విమర్శిస్తున్నారు. నిజమే కదా మరి!