గోరంట్ల మాధవ్ టాక్ ఆఫ్ ది స్టేట్

Sun Mar 24 2019 18:31:54 GMT+0530 (IST)

అనంతపురం జిల్లా హిందూపురం ఎంపీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి గోరంట్ల మాధవ్ చిక్కుల్లో పడ్డారు. ఆయన నామినేషన్ వేయడానికి ఆటంకాలు ఉన్నాయి. అయితే ఈ ఆటంకాలు ప్రభుత్వం ఉద్దేశపూర్వకగా సృష్టిస్తోందని గోరంట్ల మాధవ్ ఆరోపిస్తున్నారు. అయితే చంద్రబాబు అడ్డంకులు అధిగమనిస్తానని ... పోటీ చేయకుండా నన్ను ఆపగలరేమో ... నేను నా భార్య చేత నామినేషన్ వేయించి గెలిచి చూపిస్తానని సవాల్ చేశారు మాధవ్. రేపు తాను తన భార్య ఇద్దరూ నామినేషన్ వేస్తామని... ఒకవేళ రేపటి లోపు నన్ను రిలీవ్ చేయకపోతే తన భార్య పోటీలో ఉంటారని... టీడీపీని ఓడించి తీరుతానని ఆయన శపథం చేశారు.గోరంట్ల మాధవ్ ఒక సీఐగా పనిచేశారు. పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడిగా ఉండటం వల్ల పాపులర్ అయినా పెద్ద నాయకులకు కూడా భయపడకుండా ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో బీసీ అభ్యర్థి అయిన ఆయనను వైఎస్ జగన్ ఎంకరేజ్ చేశారు. దీంతో ఉద్యోగానికి వీఆర్ ఎస్ ఇచ్చి రాజకీయాల్లోకి దిగారు మాధవ్. అయితే ఇప్పటికే వీఆర్ఎస్ ఆమోదించకపోవడంతో వైసీపీ డైలమాలో పడింది. వీఆర్ ఎస్ ఆమోదించకుండా ఎన్నికల పోటీచేయడం కుదరదు. ఈ నేపథ్యంలో ఈ తంతుపై గోరంట్ల మాధవ్ ప్రభుత్వంపై మండిపడ్డారు.

తనను అదేపనిగా రిలీవ్  చేయడం లేదని గోరంట్ల మాధవ్ ఏపీ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. అయితే ఏపీ ట్రిబ్యునల్ ఆయన ఆయనకు అనుకూలంగా తీర్పు ఇచ్చి రిలీవ్ చేయమని గవర్నమెంటుకు చెప్పింది. అయినా మాధవ్ ను రిలీవ్ చేయలేదు. మరో వైపు నామినేషన్ల సమయం ముగిసిపోతుండటంతో మాధవ్ ఎన్నికల కమిషన్‌ను కలిశారు. ఎన్నికల కమిషనర్ ద్వివేది శుక్రవారం డీజీపీకి మాధవ్ ను రిలీవ్ చేయాలని లేఖ రాశారు.  

ఇదిలా ఉండగా... రెండ్రోజుల నుంచి కర్నూలు డీఐజీ నాగేంద్రకుమార్ అందుబాటులో  లేరు. ఈ నెల 25తో నామినేషన్ల గడువు ముగుస్తుంది. రాజకీయ కుట్రతోనే తన వీఆర్ ఎస్ ఆమోదించకుండా అడ్డంకులు సృష్టిస్తున్నారని మాధవ్ అంటున్నారు. లేని కేసులు ఉన్నట్లు చూపించి తన ఫైలు పెండింగ్ పెట్టారని మాధవ్ ఆరోపిస్తున్నారు. తనను ప్రజాక్షేత్రంలో ఎదుర్కొనే ధైర్యంలేకే టీడీపీ అడ్డదారులు తొక్కుతోందని గోరంట్ల మాధవ్ ఆరోపించారు.

ఒక సీఐకి వైసీపీ టిక్కెట్ రావడం ఒక సంచలనం అయితే ఆయనను చూసి ఒక పార్టీ భయపడటం మరో సంచలనం. ఏది ఏమైనా గోరంట్ల మాధవ్ టాక్ ఆఫ్ ది స్టేట్ అయ్యారు.