Begin typing your search above and press return to search.

ఐఐటీ కాన్పూర్ ను కన్ఫ్యూజ్ చేస్తున్న కవలలు

By:  Tupaki Desk   |   25 July 2016 7:54 AM GMT
ఐఐటీ కాన్పూర్ ను కన్ఫ్యూజ్ చేస్తున్న కవలలు
X
కవలలకు రూపంలో పోలికలు ఉండడమే కాకుండా కొన్ని అలవాట్లు కూడా ఒకేలా ఉంటాయన్న సంగతి తెలిసిందే. అంతేకాదు... పెర్ఫార్మెన్సు కూడా సేమ్ టు సేమ్ ఒకేలా ఉన్న కవలలు ఇప్పుడు అందరికీ షాకిస్తున్నారు. ముఖ్యంగా ఐఐటీ కాన్పూర్ లో చదువుతున్న ఈ కవలల దెబ్బకు అక్కడంతా కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ గా ఉందట. ఏ పరీక్ష పెట్టినా ఇద్దరికీ ఒకే మార్కులు వస్తున్నాయట. దీంతో ఈ హలో బ్రదర్సును చూసి అంతా షాకవుతున్నారు.

కాకతాళీయమో.. లేకుంటే జన్యు ఫలితమో తెలియదు కానీ వీరి రూపంలో పోలికలు- అలవాట్లే కాకుండా ప్రతిభ స్థాయి కూడా ఒకేలా ఉందట. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్ పూర్ కు చెందిన అమన్ తివారి - అంకుశ్ తివారీలు కవలలు. చిన్నప్పటి నుంచి వీరు ఒకేలా పెరిగారు. ప్రతి పరీక్షలోనూ ఒకే మార్కులు. చివరకు జేఈఈలోనూ ఇద్దరికీ సేమ్ మార్కులు వచ్చి ఐఐటీ కాన్పూర్ లో సీటు వచ్చింది. ప్రస్తుతం వారక్కడ ఎలక్ర్టికల్ ఇంజినీరింగ్ చదువుతున్నారు.

కాగా ఇద్దరి లక్ష్యం కూడా ఒకేటనట. ఇద్దరూ ఐఏఎస్ అధికారులు కావాలనుకుంటున్నారు. చిన్నప్పటి నుంచి 90 శాతానికి తక్కువ కాకుండా ప్రతిపరీక్షలో మార్కలు సాధిస్తున్నవీరు సివిల్సులోనూ సత్తా చాటుతారని అంతా అంచనా వేస్తున్నారు. దీంతో భవిష్యత్తులో వీరు ఐఏఎస్ అధికారులై ఏ రాష్ట్ర క్యాడర్ కు వెళ్తారో కానీ అక్కడ కూడా కన్ఫ్యూజన్ గ్యారంటీ.