Begin typing your search above and press return to search.

భ‌యంతో అన్ని కోతులు చచ్చిపోయాయి

By:  Tupaki Desk   |   13 Sep 2017 7:38 AM GMT
భ‌యంతో అన్ని కోతులు చచ్చిపోయాయి
X
భ‌యం అంద‌రిది. అందుకు అతీతంగా ఎవ‌రూ ఉండ‌రు. భ‌యంతో చ‌చ్చిపోవ‌టం మ‌నుషుల‌కు మామూలే. ఇదే గుణం జంతువుల‌కూ ఉంటుందా? మాన‌సిక ఆందోళ‌న‌తో జంతువులు చ‌నిపోతాయా? అన్న ప్ర‌శ్న‌కు అవుననే ఘ‌ట‌న తాజాగా చోటు చేసుకుంది.

ఉత్త‌ర భార‌తంలోని ఒక అడ‌విలో చోటు చేసుకున్న సంఘ‌ట‌న ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారి.. ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. నార్త్ లోని ఒక అట‌వీ ప్రాంతంలో 12 కోతులు ఒకేచోట మృతి చెంద‌టం క‌ల‌క‌లంగా మారింది. గుట్ట‌గా కోతులు మ‌ర‌ణించి ఉండ‌టాన్ని గుర్తించిన గిరిజ‌నులు.. అట‌వీశాఖాధికారుల‌కు స‌మాచారం అందించారు.

కోతుల్ని ఎవ‌రో చంపి ఉంటార‌ని భావించిన అధికారుల‌కు.. ఊహించ‌ని షాక్ త‌గిలింది. మ‌ర‌ణించిన కోతుల్ని వైద్య ప‌రీక్ష‌ల్ని నిర్వ‌హించగా.. చ‌నిపోయిన కోతుల‌న్నీ భ‌యంతో చ‌నిపోయినట్లుగా గుర్తించారు.

కోతుల్ని అంత‌గా భ‌య‌పెట్టిన ఉదంతం ఏమిట‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. పులి గాండ్రిపు విని భ‌యంతో గుండెపోటుతో కోతులు మ‌ర‌ణించి ఉంటాయ‌ని భావిస్తున్నారు. ఏమైనా ఈ ఉదంతంపై మ‌రింత లోతుగా అధ్య‌య‌నం చేస్తే మ‌రికొన్ని కొత్త విష‌యాలు బ‌య‌ట‌కు రావ‌టం ఖాయ‌మంటున్నారు. తాజా ఉదంతం చెప్పేదేమిటంటే.. మ‌నుషుల‌కే కాదు జంతువుల‌కూ మాన‌సిక స‌మ‌స్య‌ల కార‌ణంగా మ‌రణిస్తాయ‌ని.