Begin typing your search above and press return to search.

మ‌ళ్లీ విమానం కూల్చేశారు

By:  Tupaki Desk   |   24 Nov 2015 12:21 PM GMT
మ‌ళ్లీ విమానం కూల్చేశారు
X
ప్ర‌పంచ‌వ్యాప్తంగా రాక్ష‌స‌మూక‌ల ఆకృత్యాలు చెల‌రేగిపోతున్న నేప‌థ్యంలో చీమ‌చిటుక్కుమ‌న్నా ప్ర‌పంచం దృష్టి అటువైపు మ‌రలుతోంది. తాజాగా రష్యా విమానం కూల్చివేయ‌డం క‌ల‌క‌లం సృష్టించింది. శాంతిభ‌ద్ర‌త‌ల కోణంలో ఈ చ‌ర్య చోటుచేసుకుంద‌ని వివ‌రాలు వెలువ‌డినా....ఆ విమానం ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర‌వాదులు ల‌క్ష్యంగా దాడులు జ‌రిపేందుకు బాంబులు ర‌వాణా చేసేది కావ‌డం మ‌రింత ఆందోళ‌న‌ను సృష్టించింది.

సిరియా సరిహద్దులో రష్యా యుద్ధ విమానాన్ని టర్కీ కూల్చివేసింది. ఎఫ్ 16 కేట‌గిరీకి చెందిన శ‌క్తివంత‌మైన‌ విమానాలతో ఈ దాడి జ‌రిగింది. తమ గగనతలంలోకి చొరబడినందుకే ఆ విమానాన్ని కూల్చివేశామని ట‌ర్కీ అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఇద్దరు రష్యా పైలెట్లు సురక్షితంగా బయటపడ్డారు. వీరిలో ఒక‌రిని సిరియ‌న్ తిరుగుబాటు దారులు ప‌ట్టుకున్నార‌ని స‌మాచారం.

ట‌ర్కీ కూల్చి వేసిన యుద్ధ విమానం త‌మ‌దేనని రష్యా స్పష్టం చేసింది. అది సుఖోయ్‌ సూ 24 జెట్‌ విమానం అని వివ‌రించింది. అయితే ఆ విమానం టర్కీ గగనతలంలోకి ప్రవేశించలేదని రష్యా స్ప‌ష్టంచేసింది. ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర‌వాదుల‌పై రష్యా, సిరియా కలిసి కాల్పులు జరిపేందుకు భారీగా బాంబులు తీసుకుని వెడుతుండగా ఇది జరిగిందని ర‌ష్యా అధికారులు వివ‌రించారు. ఈ విష‌య‌మై పూర్తి వివ‌రాలు సేక‌రిస్తున్నామ‌ని తెలిపారు.