Begin typing your search above and press return to search.

తెలంగాణ ఎన్నిక‌లు : తుపాకి ఎక్స్‌ క్లూజివ్ స‌ర్వే

By:  Tupaki Desk   |   4 Dec 2018 3:12 AM GMT
తెలంగాణ ఎన్నిక‌లు :  తుపాకి ఎక్స్‌ క్లూజివ్ స‌ర్వే
X
తెలంగాణ ఎన్నిక‌ల ముఖ‌చిత్రం రోజురోజుకీ ఆస‌క్తిక‌రంగా మారుతోంది. ప్ర‌తిపార్టీ త‌న‌దైన లాజిక్‌ల‌తో గెలుపు లెక్క‌లు వేసుకుంటోంది. డ‌బ్బు, మ‌ద్యం, బ‌హుమానాలు ఇలాంటి వాటితో ప్ర‌జ‌ల‌ను ప్ర‌లోభ పెట్ట‌డానికి నేత‌లు త‌మ ప్ర‌య‌త్నాలు కొన‌సాగిస్తున్నారు. కానీ... ఇపుడు ప్ర‌జ‌లు కూడా రాజ‌కీయం నేర్చుకున్నారు. అందుకే అంద‌రికీ ఓకే చెప్పి త‌మ మ‌న‌సులో మాట‌ను దాచుకుని న‌చ్చిన వాడికి, పాల‌న‌లో మెప్పించ‌గ‌లిగిన వారికి వేస్తున్నారు. త‌మ అంచ‌నాలు గురితప్పితే బుద్ధి చెప్ప‌డానికి వారు ఎపుడూ సిద్ధంగా ఉంటారు. అనుకున్న‌ట్లు పనిచేస్తే మ‌ళ్లీ ఆశీర్వ‌దించ‌డానికి కూడా నిండు మ‌న‌సుతో ముందుకు వ‌స్తున్నారు. అనేక రాష్ట్రాల్లో అనేక సార్లు ఇది నిరూపితం అయ్యింది. మ‌రి తెలంగాణ ఓట‌రు మ‌న‌సు ఏంటి? అత‌ను ఎవ‌రి వైపు మొగ్గు చూపుతున్నారు? ఇది అత్యంత ఆస‌క్తిక‌ర‌మైన మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌. దీనిని క‌నుక్కోవ‌డానికి తుపాకి త‌న వంతు ప్ర‌య‌త్నం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒక ప్ర‌త్యేక బృందాన్ని నియ‌మించి స‌ర్వే నిర్వ‌హించింది. ఇందులో అన్ని స్థాయిల ప్ర‌జ‌ల అభిప్రాయాలు, వారి నేపథ్యాల‌ను బేరీజు వేసుకుని ఓట‌ర్ల అభిప్రాయాల‌ను లెక్కించ‌డం జ‌రిగింది. రైతుబంధు - పింఛ‌న్లు - నీటిపారుద‌ల కేసీఆర్ పాల‌న‌లో ఎక్కువ ప్ర‌భావాన్ని చూపాయి. మ్యానిఫెస్టో లో ఇవ్వ‌ని హామీలు ప్ర‌వేశ‌పెట్ట‌డం కేసీఆర్ ఇమేజ్‌ను ఈ నాలుగేళ్ల‌లో భారీగా పెంచింది. కొన్ని హామీలు నెర‌వేర‌క‌పోయినా వాటికి ప‌రిమితుల వ‌ల్లే వాయిదా ప‌డుతున్నాయ‌ని ప్ర‌జ‌లు అర్థం చేసుకుంటున్న‌ట్లు మా సర్వేలో వెల్ల‌డ‌య్యింది. ఇక స‌ర్వేలో ఏ ఏ పార్టీల ప‌ట్ల ప్ర‌జ‌లు ఏ మేర‌కు మొగ్గు చూపుతున్నార‌నే అంశాన్ని ప‌రిశీలిస్తే... ఫ‌లితాలు ఇలా ఉండ‌బోతున్నాయ‌ని అర్థ‌మయ్యింది.

టీఆర్ఎస్ - 73
కాంగ్రెస్ - 24
ఎంఐఎం - 7
ఇండిపెండెంట్లు - 5
బీజేపీ -3
టీడీపీ - 3
బీఎల్ ఎఫ్ - 2
బీఎస్పీ - 2
సీపీఎం - 0
టీజేఎస్ -0

జిల్లాల వారీగా ఫ‌లితాలు ఇలా ఉండే అవ‌కాశం ఉంది.

ఆదిలాబాద్ - కాంగ్రెస్ 2 - బీఎస్పీ 1 - టీఆర్ఎస్ 6 - ఇత‌రులు 1

నిజామాబాద్ - బీజేపీ 1 - కాంగ్రెస్ 1 - టీఆర్ఎస్ 7

క‌రీంన‌గ‌ర్ - కాంగ్రెస్ 2 - టీఆర్ఎస్ 10 - ఇత‌రులు 1

మెద‌క్ - కాంగ్రెస్ 2 - టీఆర్ఎస్ 8

రంగారెడ్డి - బీఎస్పీ 1 - కాంగ్రెస్ 3 - టీఆర్ఎస్ 9 - ఇత‌రులు 1

హైద‌రాబాద్ - బీజేపీ 2 - ఎంఐఎం 7 - టీఆర్ఎస్ 6

మ‌హూబూబ్‌న‌గ‌ర్ - బీఎల్ఎఫ్ 1 - కాంగ్రెస్ 5 - టీఆర్ఎస్ 7 - ఇత‌రులు 1

న‌ల్గొండ - బీఎల్ఎఫ్ 1 - కాంగ్రెస్ 4 - టీఆర్ఎస్ 7

వ‌రంగ‌ల్ - కాంగ్రెస్ 3 - టీఆర్ఎస్ 9

ఖ‌మ్మం - కాంగ్రెస్ 2 - టీడీపీ 3 - టీఆర్ఎస్ 4 - ఇత‌రులు 1