Begin typing your search above and press return to search.

మోడీపై అవిశ్వాసం సృష్టించిన రికార్డ్ ఇది

By:  Tupaki Desk   |   23 July 2018 5:42 PM GMT
మోడీపై అవిశ్వాసం సృష్టించిన రికార్డ్ ఇది
X
పార్ల‌మెంటులో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం ఎపిసోడ్ అనూహ్య రికార్డ్‌ ను న‌మోదు చేసుకుంది. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు లోక్‌ సభలో హోరాహోరీగా సాగిన చర్చ అనంతరం అవిశ్వాసం వీగిపోయిన సంగ‌తి తెలిసిందే. ఓటింగ్‌లో అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 126 ఓట్లు రాగా, వ్యతిరేకంగా 325 ఓట్లు వచ్చాయి. దీంతో అవిశ్వాస తీర్మానం వీగిపోయినట్టు స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రకటించారు. అయితే, ఈ సంద‌ర్భంగా ప‌లు ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటుచేసుకున్నాయి. రాఫెల్ యుద్ధవిమానాల కొనుగోలు ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ.. చౌకీదార్ (కాపలాదారు)గా ఉంటానన్న ప్రధాని, భాగీదార్ (అవినీతిలో భాగస్వామి)గా మారారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన ప్రసంగం తర్వాత ఆయన నేరుగా మోడీ వద్దకు వెళ్లి ఆయనను ఆలింగనం చేసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

ప్ర‌ధాని మోడీని రాహుల్ కౌగిలించుకోవ‌డం ప్ర‌ధాన మీడియాలోనే కాకుండా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. దీంతోపాటుగా ప‌లు ప‌రిణామాల‌పై నెటిజ‌న్లు స్పందించారు. అవిశ్వాసానికి అనుకూలంగా - వ్య‌తిరేకంగా - త‌ట‌స్థంగా- చ‌ట్ట‌స‌భ‌లో చ‌ర్చ‌ను ప్ర‌స్తావిస్తూ...ఇలా వివిధ రూపాల్లో నెటిజ‌న్లు హ్యాష్‌టాగ్‌లు సృష్టించి రియాక్ట‌య్యారు. #MonsoonSession, #NoConfidenceVote, #NoConfidenceMotion, #BhookampAaneWalaHai, #KyaHuaTeraVaada, #NoConfidencePolitics, #hugplomacy and #IndiaTrustsModi వంటి హ్యాష్‌ట్యాగ్‌తో నెటిజ‌న్లు త‌మ భావాల‌ను పంచుకున్నారు. సెటైర్లు వేశారు, విమ‌ర్శ‌లు గుప్పించారు.

ఇలా సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ట్విట్ట‌ర్‌ లో సాగిన అభిప్రాయాల ప‌రంప‌ర రికార్డు సృష్టించింద‌ని ట్విట్ట‌ర్ తెలిపింది. అవిశ్వాసం సంద‌ర్భంగా శుక్ర‌వారం ఉద‌యం 10.30 గంట‌ల నుంచి రాత్రి 11.30 గంట‌ల వ‌ర‌కు సాగిన ప‌రిణామాల‌పై పై హ్యాష్‌ ట్యాగ్‌ ల‌తో మొత్తం 1.1 మిలియ‌న్ల మంది ట్వీట్లు చేశార‌ని ట్విట్ట‌ర్ తెలిపింది. ఈ ట్వీట్ల వ‌ర‌ద ప్ర‌త్యేక రికార్డును సాధించింద‌ని ఇటీవ‌లి కాలంలో ఈ స్థాయిలో మ‌రే రికార్డు న‌మోదు కాలేదని వెల్ల‌డించింది.