Begin typing your search above and press return to search.

హెచ్ 1 బీ వీసాల‌పై ట్రంప్ బాంబు!

By:  Tupaki Desk   |   19 Oct 2018 10:06 AM GMT
హెచ్ 1 బీ వీసాల‌పై ట్రంప్ బాంబు!
X
2014లో అమెరికా అధ్య‌క్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్య‌త‌లు చేప‌ట్టిన‌ప్ప‌టి నుంచి అక్క‌డ ప్ర‌జ‌ల్లో లోకల్ సెంటిమెంట్ మ‌రింత బ‌ల‌ప‌డిన సంగ‌తి తెలిసిందే. ఏ మాత్రం అవ‌కాశం దొరికినా నాన్ అమెరిక‌న్ల‌కు ఉద్యోగాలు లేకుండా చేయాల‌ని....అక్క‌డి ఉద్యోగాల‌న్నీ లోక‌ల్ అమెరిక‌న్ల‌కే రావాల‌ని ట్రంప్ శ‌త‌విధాలా ప్ర‌య‌త్నిస్తున్నారు. అందులో భాగంగానే హెచ్-1బీ వీసాల జారీ ప్ర‌క్రియ‌లో ప‌లు నిబంధ‌న‌ల‌ను క‌ఠిన‌త‌రం చేస్తూ వ‌చ్చారు. హెచ్‌–1బీ వీసా విధానంలో కీలకమైన అమెరిక‌న్ ఇమ్మిగ్రేష‌న్ అధికారుల‌కు ...ట్రంప్ మ‌రిన్ని అధికారాలిచ్చారు. హెచ్ 1బీ వీసాల‌ను యూఎస్ సిటిజెన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేష‌న్ స‌ర్వీసెస్(యూఎస్ సీఐఎస్) .....త‌మ విచ‌క్ష‌ణాధికారాల ప్ర‌కారం తిర‌స్క‌రించేలా కొత్త మార్గ‌ద‌ర్శ‌కాల‌ను ట్రంప్ రూపొందించారు. తాజాగా, హెచ్ 1బీ వీసాల పై ట్రంప్ మ‌రో బాంబు పేల్చారు. అత్యంత నైపుణ్యం క‌లిగిన‌, అత్యుత్త‌మ‌మైన ప్ర‌తిభావంతులైన‌ విదేశీయుల‌కు మాత్ర‌మే ఇక‌పై హెచ్ 1బీ వీసాలు జారీ చేయాల‌ని ట్రంప్ నిర్ణ‌యించారు. జ‌న‌వ‌రి 2019 నుంచి కొత్త నిబంధ‌న‌లు అమ‌లులోకి తెచ్చేందుకు ట్రంప్ సిద్ధ‌మ‌వుతున్నారు.

`స్పెషాలిటీ ఆక్యుపేష‌న్` కింద విదేశీయుల‌కు హెచ్ 1బీ వీసాలను అమెరికా జారీ చేస్తుంది. ఆ ఆక్యుపేష‌న్ నిబంధ‌న‌కు మార్పులు చేర్పులు చేయాల‌ని ట్రంప్ భావిస్తున్నారు. అత్యంత నైపుణ్యం క‌లిగిన‌ - అత్యుత్త‌మ‌మైన ప్ర‌తిభావంతులైన వారికి మాత్ర‌మే వీసాలు జారీ చేయాల‌ని ట్రంప్ స‌ర్కార్ ప్లాన్ చేస్తోంద‌ట‌. అమెరిక‌న్ల‌కు వేత‌నం - ఉద్యోగ భ‌ద్ర‌తలో లాభం చేకూరేలా నిబంధ‌న‌లు స‌డ‌లించ‌నున్నార‌ట‌. హెచ్ 1 బీ వీసాపై ప‌నిచేసే వారికి త‌గినంత పారితోషికం - జీతం మాత్ర‌మే చెల్లించేలా నిబంధ‌న‌లు స‌వ‌రించ‌నున్నార‌ట‌. ఈ ప్ర‌భావం భార‌తీయుల‌పై అధికంగా ప‌డ‌నుంది. ఐటీ కంపెనీలు నిర్వ‌హిస్తోన్న భార‌తీయ అమెరిక‌న్ల‌కు ఈ నిబంధ‌న శ‌రాఘాతం కానుంది. ఆ నిబంధ‌న‌లు పూర్తిగా అమ‌లులోకి వ‌స్తే...సంస్థ‌కు - హెచ్ 1బీ వీసాపై ప‌ని చేస్తోన్న ఉద్యోగికి ఇద్ద‌రికీ న‌ష్ట‌మేన‌ని అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.