మోడీ సమక్షంలోనే మహిళా మంత్రిని అలా తాకాడు!

Tue Feb 12 2019 13:38:40 GMT+0530 (IST)

అక్కడ ఉంది అలాంటి ఇలాంటి అధినేత కాదు.. తన కనుసైగతో శాసించే పేరున్న నేత. అలాంటి నేత ముందు ఎవరైనా ఒక నేత పిచ్చి వేషాలు వేస్తారని అనుకోగలమా?  అది కూడా గౌరవనీయమైన మహిళా మంత్రితో మరో మంత్రి అభ్యంతరకర రీతిలో వ్యవహరిస్తారని ఊహించగలమా?  కానీ.. అలాంటి దరిద్రమైన పని చేసిన వైనం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావటమే కాదు.. పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.కాస్త ఆలస్యంగా వెలుగు చూసిన ఈ దుర్మార్గం త్రిపురలో చోటు చేసుకుంది. అగర్తలో నిర్వహించిన ఒక ర్యాలీకి ప్రధానమంత్రి మోడీ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ దేవ్ కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు హాజరయ్యారు. వీరిలో రాష్ట్ర ఆహార మంత్రిత్వ శాఖ మంత్రి మనోజ్ కుంతి దేబ్ కూడా హాజరయ్యారు. విప్లవ్ దేవ్ మంత్రివర్గంలో ఉన్న ఏకైక మహిళా మంత్రి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వేదిక మీద కార్యక్రమం జరుగుతుండగా మహిళా మంత్రికి అత్యంత సమీపంలోకి వచ్చిన మనోజ్.. ఆమెను వెనుక నుంచి అభ్యంతరకర రీతిలో తాకారు.

దీనికి ఆమె సున్నితంగా చేతితో వెనక్కి నెట్టిన వైనం వీడియోలో కనిపిస్తోంది.ఈ వీడియో బయటకు రావటం.. వైరల్ గా మారటమేకాదు.. పలువురు తీవ్రంగా చివాట్లు పెట్టేస్తున్నారు. బహిరంగానే ఇంత దుర్మార్గంగా వ్యవహరించిన మంత్రి.. విడిగా మరెలా ఉంటారు? అన్న ప్రశ్నను పలువురు వ్యక్తం చేస్తున్నారు. మంత్రిని వెంటనే అరెస్ట్ చేయాలని.. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. తనను అవమానకరంగా తాకిన మంత్రి తీరుపై సదరు మహిళా మంత్రి రియాక్ట కావాల్సి ఉంది. ఇదిలా ఉండగా.. పాడు పని చేసిన మంత్రి మనోజ్ ను ఈ విషయమైన వివరణ కోరగా.. ఆయన స్పందించేందుకు నిరాకరించారు. చేసిన చెత్త పని సాక్ష్యంగా బయటకు వచ్చిన వేళ.. ఎలా సమర్థించుకున్నా జనాలు ఛీ కొట్టటం ఖాయం. అందుకే.. ముఖం చాటేస్తున్నారని చెప్పక తప్పదు.