నా చేతులు తీసేయండి.. ట్రీమ్యాన్ ఆవేదన

Tue Jun 25 2019 11:30:51 GMT+0530 (IST)

ట్రమ్యాన్.. బంగ్లాదేశ్ కు చెందిన అబ్దుల్ బజందర్ అనే వ్యక్తి ఈ  చెట్టుమనిషిగా పేరొందాడు. కలియుగంలోనే ఇదో వింత.. ఓ మనిషి చెట్టులా మారిపోతున్నాడు.. అతడి శరీరంలోని కీలక భాగాలంతా చెట్టు బెరుడులా మారిపోతున్నాయి. కాళ్లు చేతులు వేర్లలా మారిపోతున్నాయి.  చేతి వేళ్లు కాళి వేళ్లు బెరడులాగా అయ్యి అంతుచిక్కని ఆ వ్యాధి అతడిని కొన్నేళ్లుగా వేధిస్తోంది. ‘ట్రీమ్యాన్ సిండ్రోమ్’ అనే వ్యాధికి ఇప్పటివరకు మందు లేదు. జన్యు సంబంధిత లోపాలతో ఈ వ్యాధి సోకుతుంది. ప్రపంచంలో 10 మంది బాధితులు మాత్రమే ఇలాంటి వారు ఉన్నారు.అందులో బంగ్లాదేశ్ కు చెందిన అబ్దుల్ ఒకరు.
 
*ట్రీమ్యాన్ వ్యాధి లక్షణాలేంటి.?
 అబుల్ బజందర్ అనే యువకుడికి  హ్యూమన్ పపిల్లోమా వైరస్ (Hpv) సోకింది. ఈ వ్యాధి సోకితే చర్మం చెట్టు బెరుడులా విచ్చిన్నమవుతుంది. దీన్ని ‘పులిపిర్లు’ అని కూడా అంటారు. రోగ నిరోధక శక్తి బాగా క్షీణించేవారికి ఈ వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.*చికిత్స ఎంతవరకు వచ్చింది..
ఈ అరుదైన వ్యాధికి బంగ్లాదేశ్ రాజధాని ఢాకా వైద్యకళాశాల వైద్యులు దాదాపు 16 శస్త్రచికిత్సలు చేసి సంవత్సరం క్రితమే ఆ పులిపిర్లు అన్నీ కట్ చేసి చేతులను మళ్లీ పూర్వపు రూపంలోకి తీసుకొచ్చారు. కానీ అబుల్ ఆనందం ఎంతో కాలం నిలవలేదు. మళ్లీ ఈ అరుదైన వ్యాధి ముదిరింది. మరోసారి చేతులు కాళ్లు చెట్టు బెరుడులా మారిపోతున్నాయని అబుల్ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దీనివల్ల తన పిల్లలను కూడా తాకలేకపోతున్నాని.. అందరూ నావద్దకు రావడానికి భయపడిపోతున్నాడని ఆవేదన చెందుతున్నాడు.

*నా చేతులు తీసేయండి.. అబ్దుల్ ఆవేదన
రిక్షా తొక్కుకు బతికే అబ్దుల్ వ్యాధి మళ్లీ ముదిరింది. భరించలేని పరిస్థితితో మళ్లీ ఢాకాలోని వైద్యశాలకు వచ్చి చేరాడు. ఈ క్రమంలోనే ఇక తనకు బాగు కాదని.. తన చేతులు తొలగించాలని అబ్దుల్ కోరుతున్నాడు.  అతడి తల్లి కూడా కొడుకు బాధ కంటే చేతులు తీసేయాలని.. అప్పుడే ఆ బాధ పోతుందని చెబుతోంది.

అయితే అహ్మద్ కు మళ్లీ వ్యాధి ముదరడంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం ఉచితంగా వైద్యం అందిస్తోంది. అతడిని విదేశాలకు పంపి మెరుగైన చికిత్స అందించాలని చూస్తోంది. భార్యకూతురు అబ్దుల్ కు ఉన్నారు. ఇప్పుడు చేతులు తీసేయాలని కోరుతున్న అబ్దుల్ వేదనకు ప్రపంచవ్యాప్తంగా సానుభూతి కరుస్తోంది.