Begin typing your search above and press return to search.

కేటీఆర్‌ ను క‌శ్మీర్‌ కు పిలిచింది ఎవ‌రంటే...

By:  Tupaki Desk   |   17 Jan 2019 6:42 AM GMT
కేటీఆర్‌ ను క‌శ్మీర్‌ కు పిలిచింది ఎవ‌రంటే...
X
టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిండెట్ కేటీఆర్ సోష‌ల్ మీడియాలో ఎంత యాక్టివ్‌ గా ఉంటారో తెలిసిన సంగ‌తే. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏదైనా ఆయ‌న స్పందిస్తుంటారు. అలా స్పందించ‌డం వ‌ల్లే ఆయ‌న‌కు జ‌మ్ముక‌శ్మీర్ నుంచి ఆహ్వానం అందింది. అలా ఆహ్వానించింది ఎవ‌రో తెలుసా? జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా.! మామూలు ఆహ్వానం కాదు...త‌మ ఇంటికి ర‌మ్మ‌ని...న‌చ్చిన‌న్ని రోజులు ఉండిపొమ్మ‌ని ఆయ‌న వెల్‌ కం చెప్పేశారు.

ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే...జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా తన ఇంటి ఫొటోను ట్విట్టర్‌ లో పోస్టు చేశారు. ప్ర‌స్తుతం జ‌మ్ముక‌శ్మీర్‌ లో విప‌రీతంగా మంచుకురుస్తుండ‌టంతో...పూర్తిగా మంచుతో కప్పబడి ఉన్న ఆ ఇల్లు ఫోటో ఆక‌ట్టుకుంటోంది. ఈ ఫొటోను సోషల్ మీడియాలో చూసిన కేటీఆర్ `చాలా అందంగా ఉంది…నాకు అలాంటి ప్రాంతంలో ఇల్లు ఉంటే బాగుండేది` అని ట్వీట్ చేశారు. కేటీఆర్ ట్వీట్ కి స్పందించిన ఒమర్ ``మా ఇంటిని మీ ఇల్లే అనుకోండి. ఇక్కడకు వచ్చి మీకు నచ్చినన్ని రోజులు ఉండొచ్చు`` అని రిప్లై ఇచ్చారు. దీనిపై మళ్లీ కేటీఆర్ వెంటనే స్పందించారు. ``మీ కామెంట్స్ ని నేను సీరియస్‌ గా తీసుకుంటాను` అంటూ కేటీఆర్ సరదాగా ట్వీట్ చేశారు. వీరిద్దరి ట్వీట్ల సంభాషణ ఇప్పుడు వైరల్ గా మారింది.

ఇది ఇక్క‌డితోనే ఆగిపోలేదు ట్విట్టర్ వేదిక‌గా ఈ ఇద్దరి మధ్య జ‌రిగిన ఆసక్తికర సంబాషణను ఓ జాతీయ ఛాన‌ల్ హైలెట్ చేసింది. దీంతో దీనికి కేటీఆర్ స్పందించారు. ఆత్మీయ సంభాష‌ణ కూడా మీడియా దృష్టిని ఆక‌ర్షిస్తుందా? అంటూ సెటైర్ వేశారు.